లక్కీ డ్రాలో కారు గెలుచుకున్నారంటూ ఫోన్.. తీరా చూస్తే దారుణం..
TeluguStop.com
ఇటీవల కాలంలో సైబర్ నేరాలు బాగా పెరిగిపోతున్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ క్రమంలోనే పోలీసు అధికారులు అన్‌నౌన్ నెంబర్స్ నుంచి వచ్చే కాల్స్ పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.
ఇకపోతే ఈ కరోనా టైం నుంచి సైబర్ నేరస్థులు కొత్త కొత్త ట్రిక్స్ ఉపయోగించి మరీ మోసాలు చేస్తున్నారు.
తాజాగా సైబర్ నేరస్థలు ఒకటి కాదు రెండు ఏకంగా పదిహేడు లక్షల రూపాయల మోసం చేశారు.
ఇంతకీ ఆ మోసం ఎక్కడ జరిగిందంటే.హైదరాబాద్‌లోని గోల్కొంగ ఏరియాకు చెందిన ముజాహిద్‌ఖాన్ అనే వ్యక్తికి ఇటీవల ఓ ఫోన్ కాల్ వచ్చింది.
వారు లక్కీ డ్రాలో విలువైన ఎక్స్ యూవీ కారును ముజాహిద్ గెలచుకున్నట్లు నమ్మించారు.
సదరు కారును ఇంటి వద్దకు చేర్చడానికి కొంత డబ్బు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు.
దాంతో అది నిజమని భావించాడు.ఈ క్రమంలోనే బాధితుడు ముజాహిద్ ఖాన్ నుంచి ట్యాక్సులు, ప్రాసెసింగ్, ఇన్సూరెన్స్ ఫీ పేరిట విడతల వారీగా రూ.
17.35 లక్షల నగదును వసూలు చేశాడు.
ఇక డబ్బులు చెల్లించినందున తనకు కారు వస్తుందని ముజాహిద్ ఖాన్ ఎదురు చూస్తూనే ఉన్నాడు.
డబ్బు అంతా కూడా ఆన్‌లైన్‌లోనే పంపించాడు.తాజాగా ఆయనకు అనుమానం వచ్చి, సదరు నెంబర్స్‌కు ఫోన్ చేయగా వారు స్పందించడం లేదు.
"""/"/ అప్పుడు సైబర్ నేరస్థుల చేతిలో తాను దారుణంగా మోసపోయానని ముజాహిద్ అనుకున్నాడు.
వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఈ విషయాలను తెలపగా, వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సైబర్ నేరస్థుల ఫోన్ నెంబర్స్‌ను, బ్యాంక్ అకౌంట్ డేటాను పరిశీలిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే సైబర్ క్రైమ్ పోలీసులు అన్‌నౌన్ నెంబర్స్ నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌ను లిఫ్ట్ చేసే క్రమంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.
ఎలాంటి ఆఫర్స్ గురించి చెప్పినా వెంటనే నమ్మొద్దని తెలిపారు.సైబర్ నేరస్థులు బాగా నమ్మించి మోసం చేస్తారని, అందుకే త్వరగా ఎవరి మాటలు నమ్మకూడాని పేర్కొన్నారు సైబర్ క్రైమ్ పోలీసులు.
జాన్వీతో ఎప్పటికీ సినిమా చేయనని చెప్పిన ప్రముఖ స్టార్ డైరెక్టర్.. ఏం జరిగిందంటే?