సాకే భారతికి ఆ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఉద్యోగం.. ఈ మహిళ సక్సెస్ వెనుక భర్త ఉన్నాడంటూ?

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో సాకే భారతి( Sake Bharati ) పేరు ఎక్కువగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

ఒకవైపు కూలి పనులు చేస్తూనే మరోవైపు పీహెచ్డీ( PhD ) సాధించి సాకే భారతి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు.

రేయింబవళ్లు తీవ్రంగా శ్రమిస్తే మాత్రమే పీహెచ్డీ పట్టా పొందే అవకాశం ఉంటుంది.సాకే భారతి సక్సెస్ వెనుక భర్త కృషి ఎంతో ఉంది.

భార్య కోరిక నెరవేరాలని ఎంతో కష్టపడి భర్త చదివించడం భారతి కన్న కలలు నిజమయ్యాయి.

ఎమ్మెల్సీ కుంబా రవిబాబు సాకే భారతికి తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో( SV Universty ) ప్రొఫెసర్ ఉద్యోగం చేసే ఛాన్స్ కలిస్తానని హామీ ఇచ్చారని తెలుస్తోంది.

ఎన్నో కష్టాలను అనుభవించి సాకే భారతి ఈ స్థాయికి చేరుకున్నారు.ఆర్థికంగా భారతి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటుండగా దాతలు తమ వంతు సహాయసహకారాలు అందిస్తున్నారని సమాచారం అందుతోంది.

సరైన వసతులు లేకపోయినా సాకే భారతి ఈ స్థాయికి ఎదిగారు. """/" / తనకు డాక్టరేట్ వచ్చినా సాకే భారతిలో అణువంతైనా గర్వం లేదు.

పేదరికం వెంటాడినా సాకే భారతి కలలను నెరవేర్చుకున్నారు.సాకే భారతి తన భర్త శివప్రసాద్( Shiv Prasad ) రేయింబవళ్లు కూలికెళ్లి సంసారాన్ని నెట్టుకొచ్చాడని చెప్పుకొచ్చారు.

భర్త శ్రమ వల్లే నేను పీహెచ్డీ పట్టా పొందడం సాధ్యమైందని ఆమె కామెంట్లు చేశారు.

జగన్ సర్కార్ ఈ కుటుంబానికి ఇల్లు మంజూరు చేస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

"""/" / ప్రభుత్వం నుంచి సహాయసహకారాలు అందితే సాకే భారతి కెరీర్ పరంగా మరింత ఎదగడంతో పాటు సక్సెస్ సాధించాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

భారతి దంపతులకు ఎనిమిది సంవత్సరాల కూతురు ఉంది.సాకే భారతి లాంటి ప్రతిభ ఉన్నవాళ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ల చదువుకు ఆటంకం కలగకుండా కొత్త పథకాలను అమలు చేయాల్సి ఉంది.

స్టార్ హీరో అక్కినేని నాగార్జున మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్ సినిమాలివే.. ఏం జరిగిందంటే?