అంబాసిడర్‌ కారు అభిమానులకు గుడ్‌ న్యూస్‌.. మార్పుకు మీరు సిద్దంగా ఉంటే ఇది చదవండి

ఒకప్పుడు కారు అంటే అంబాసిడర్‌ మాత్రమే.ఇండియాలో అంబాసిడర్‌ కార్లు తప్ప మరే కార్లు ఉండేవి కావు.

ఒకవేళ కొత్త కంపెనీ ఏదైనా వచ్చినా కూడా దాన్ని పట్టించుకునేవారు కాదు.అంబాసిడర్‌ కారు అంటేనే రాయల్టీగా భావించేవారు.

భారత ప్రధాని, రాష్ట్రపతి, ముఖ్యమంత్రులు ఇలా అంతా కూడా అంబాసిడర్‌ కార్లలో రాయల్‌గా తిరిగిన వారే.

1970 నుండి 2000 సంవత్సరం వరకు అంటే దాదాపుగా 30 ఏళ్ల పాటు ఇండియాలో కారు అంటే అంబాసిడర్‌ మాత్రమే అన్నట్లుగా సాగింది.

అయితే దేనికైనా కొంత వరకే ఆయువు ఉంటుంది.2000 సంవత్సరం తర్వాత మెల్ల మెల్లగా అంబాసిడర్‌ ప్రాభవం తగ్గిపోయింది.

విదేశీ మరియు స్వదేశీ కంపెనీలు కలిసి కొత్త కార్లను తీసుకు రావడం, వాటిని మార్కెట్‌లో పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో పాటు ఏసీ ఇంకా కొత్త కొత్త ఫీచర్స్‌ రావడంతో అంబాసిడర్‌ కార్ల వినియోగం తగ్గింది.

రోడ్డు మీద ప్రస్తుతం అంబాసిడర్‌ కారు కనిపించిందంటే అబ్బ అనుకునే పరిస్థితి.అంబాసిడర్‌ పూర్తిగా కనుమరుగయ్యింది.

అంబాసిడర్‌ కార్లను ప్రస్తుతం ఎగ్జిబీషన్స్‌ లేదంటే నెట్‌లో చూడాల్సిన పరిస్థితి.అలాంటి అంబాసిడర్‌ కార్లు మళ్లీ వస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చాలా విభిన్నంగా ఉంది కదా, అప్పట్లో మాదిరిగా అంబాసిడర్‌ వస్తే ఎవరు పట్టించుకోక పోవచ్చు.

కాని ఈతరం కార్ల తరహాలో అంబాసిడర్‌ వస్తే మాత్రం దుమ్ము దుమ్ముగా అమ్ముడు పోవడం ఖాయం.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ విశాలమైన స్పేష్‌ ఉండే అంబాసిడర్‌ కార్లను ఇప్పటికి కూడా ఎంతో మంది అభిమానిస్తున్నారు.

కాని అందులో ఏసీ సదుపాయాలు లేకపోవడం, ఆటో మేటివ్‌ డోర్‌ గ్లాస్‌, సీటు కంఫర్ట్‌బిలిటీ, ఎయిర్‌ బెలున్స్‌ వంటివి ఉండని కారణంగా వాటిని ఫ్రిపర్‌ చేయడం లేదు.

అయితే త్వరలోనే అంబాసిడర్‌ కారు ఆ ఆధునిక సదుపాయాలన్నింటితో జనాల ముందుకు రాబోతుంది.

ప్రపంచంలో అత్యధిక కార్ల మార్కెట్‌ ఉన్న ప్యూజో తాజాగా అంబాసిడర్‌ బ్రాండ్‌ ను ఏకంగా 80 కోట్లకు కొనుగోలు చేయడం జరిగింది.

కేవలం పేరు మాత్రమే కాకుండా, అంబాసిడర్‌కు చెందిన అన్ని ఫీచర్స్‌పై కూడా ప్యూజోకు అధికారం దక్కింది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ప్యూజో కంపెనీ ఇండియాలో ఒక దేశీయ కంపెనీతో కలిసి కొత్త అంబాసిడర్‌ కార్లను తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేసింది.

అంబాసిడర్‌ లుక్‌ ఉండేలా, అదే అంబాసిడర్‌ బ్రాండ్‌ నేమ్‌తో అధునాతన ఫీచర్స్ తో తీసుకు రాబోతున్నారు.

దీని దరకూడా కాస్త తక్కువగానే ఉండే అవకాశం ఉంది.10 లక్షల నుండి ధర ప్రారంభ అయ్యే అవకాశం ఉంది.

అంబాసిడర్ కార్లను ఇష్టపడే ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని షేర్ చేయండి.

కోడిని కూడా వదలలేదుగా.. హిప్నోటైజ్ చేసి పడేసిన వ్యక్తి… వీడియో వైరల్!