రజినీకాంత్ మాస్ క్యారెక్టర్ లో నటించిన 'పేట' హిట్టా.? స్టోరీ రివ్యూ అండ్ రేటింగ్!!!
TeluguStop.com
సూపర్ స్టార్ రజినీకాంత్.ఈ పేరుకి ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు.
రజిని సినిమా అంటే అభిమానులు ఎంత ఆసక్తిగా వెయిట్ చేస్తారో అందరికి తెలిసిందే.
కబాలి’, ‘కాలా’, ‘2.0’ తెలుగులోనూ మంచి ఓపెనింగ్స్‌ను రాబట్టాయి.
కానీ ఈ మూడు సినిమాలు పాత రజినీకాంత్‌ను గుర్తుచేయలేకపోయాయి.అయితే, ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పేట’ అలాకాదు.
ఒకప్పటి రజినీకాంత్‌ను గుర్తుచేసిన పక్కా మాస్ మసాలా సినిమా ఇది.మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుగుస్టాప్ న్యూస్ సమీక్ష లో చూద్దాం.
Cast And Crew:
నటీనటులు: రజినీకాంత్, విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్దిఖ్, సిమ్రాన్, త్రిష తదితరులు
దర్శకత్వం: కార్తీక్ సుబ్బరాజు
నిర్మాత: కాలానిథి
సంగీతం: అనిరుద్ రవిచందర్ Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
H3 Class=subheader-styleకథ :/h3p
కాళీ రజినీకాంత్ కొంతమంది రౌడీలతో చేసే ఫైట్ సీన్ తో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది.
రాగ్గింగ్ ని అరికట్టడానికి హాస్టల్ వార్డెన్ గా చేరుతాడు కాళీ.హాస్టల్ లోని ఓ స్టూడెంట్ తల్లిగా సిమ్రాన్ తెరపై పరిచయమవుతుంది.
ఆమెతో క్లోజ్ అవుతాడు కాళీ.ఇంతలో హాస్టల్ లోని కొంతమంది స్టూడెంట్స్ కాళీని మర్డర్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు.
రెండు మూడు సార్లు హత్య చేయడానికి ప్రయత్నించగా కాళీ అసలు పేరు "పేట వీరా" అనే విషయం బయటపడుతుంది.
ఇంతలో ఇంటర్వెల్.సెకండ్ హాఫ్ లో పేట వీరా ఫ్లాష్ బ్యాక్,.
సింహాచలం నవాజుద్దీన్ సిద్దిఖ్ తో తన శత్రుత్వం గురించి చెప్తాడు వీరా.మాఫియా , రాజకీయాలు పెద్ద ఎత్తున ఎదిగిన సిమ్హాచలంపై రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటాడు పేట వీరా.
ఇంతలో విజయ్ సేతుపతి తెరపైకి వస్తారు.వారిద్దరి మధ్య సంబంధం ఏంటి.
? చివరికి రజిని రివెంజ్ తీర్చుకున్నారా లేదా అనేది తెలియాలి అంటే తెరపై చూడాల్సిందే.
H3 Class=subheader-styleనటీనటుల ప్రతిభ./h3p
రజినీకాంత్ అంటే మాస్.
90 ల నాటి భాష, నరసింహ, అరుణాచలం, ముత్తు లాంటి సినిమాలని గుర్తుచేస్తుంది పేట.
గత కొన్ని సినిమాలనుండి అలాంటి మాస్ చిత్రాలనుండి దూరంగా ఉన్నారు రజిని, పేట సినిమా రజినీకాంత్ అభిమానులకి పండగే.
రజినీకాంత్ నటన గురించి కొత్తగా చెప్పనవసరం లేదు అనుకుంట.సింహాచలం పాత్రకు నవాజుద్దీన్ సిద్దిఖ్ న్యాయం చేసారు.
చివర్లో విజయ్ సేతుపతి క్యారెక్టర్ కూడా హైలైట్.ఇక హీరోయిన్లు గా సిమ్రాన్, త్రిష ఈ చిత్రంలో ఎంతో అందంగా కనిపించరు.
ఒకరకంగా సిమ్రాన్ కి ఇది కం బ్యాక్ సినిమా అనే చెప్పాలి.h3 Class=subheader-styleటెక్నికల్ గా.
/h3p
సినిమాకి టెక్నికల్ గా మాంచి మార్కులు పడింది.సినిమాటోగ్రఫీ బాగుంది.
రజినీకాంత్ ని చాలా యంగ్ గా చూపించారు.ఈ సినిమాకి అనిరుద్ అందించిన సంగీతం కూడా హైలైట్.
కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం సూపర్ అంటున్నారు సినిమా చూసినవారు.h3 Class=subheader-styleవిశ్లేషణ :/h3p
సినిమా సూపర్.
రజినీకాంత్ స్టైల్లో పక్కా మాస్ సినిమా పేట.ఈ సినిమా మళ్లీ 90ల్లో రజినీకాంత్‌ను గుర్తుచేసింది.
హాస్టల్ వార్డెన్‌గా రజినీ నటన, కామెడీ టైమింగ్, ఫైట్లు, మాస్ పాటలు అబ్బో సినిమాలో ఎంటర్‌టైన్మెంట్‌కు కొదవే లేదు.
ఫస్టాఫ్‌లో వచ్చే ట్విస్ట్, ఇంటర్వల్ బ్యాంగ్ సినిమాకే హైలైట్.అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమా కి ప్లస్ పాయింట్.
యాక్షన్ సన్నివేశాల్లో అదిరిపోయే నేపథ్య సంగీతం ఇచ్చాడని ప్రేక్షకులు కొనియాడుతున్నారు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
H3 Class=subheader-styleప్లస్ పాయింట్స్ :/h3p
రజినీకాంత్
నవాజుద్దీన్ , విజయ్ సేతుపతి
సిమ్రాన్
అనిరుద్ సంగీతం
సినిమాటోగ్రఫీ
మాస్ సీన్స్
ఫైట్స్
ఇంటర్వెల్
కథలోని ట్విస్ట్
కామెడీ టైమింగ్
H3 Class=subheader-styleమైనస్ పాయింట్స్:/h3p
క్లైమాక్స్
H3 Class=subheader-styleతెలుగుస్టాప్ రేటింగ్ : 3.
5/5/h3p
బోటం లైన్ – ఒకప్పటి రజినీకాంత్ ని గుర్తుచేసే సినిమా 'పేట'.అభిమానులకి పండగే.
నాని తేజ సజ్జ లకు సక్సెస్ లు వస్తున్నాయి…మరి ఆ ఇద్దరు స్టార్ హీరోలకు మాత్రం ఎందుకు ప్లాప్ లు వస్తున్నాయి…