పెట్రోల్, డీజిల్ రేట్లపై ప్రభుత్వంపై విరుచుకుపడ్డ లోకేష్..!

రోజు రోజుకి పెరుగుతున్న ఇంధన ధరల రేట్లు సామాన్య ప్రజలకు భారంగా తయారవుతున్నాయి.

ఈ క్రమంలో పెట్రోల్, డీజిల్ రేట్ల పెరుగుతులపై ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు టీడీపీ నేత నారా లోకేష్.

రక్తం పీల్చే జగలకన్నా దారుణంగా ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నారు ఏపీ సీం వైఎస్ జగన్ అని విమర్శించారు లోకేష్.

ఆకాశమే హద్దుగా ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు వెళ్తున్నాయని.ఇండియన్ పెట్రోల్ లీ లో పెట్రోల్ ధరను 108 రూ.

లు, డీజిల్ ధరను 100 రూ.లు చేసి రికార్డుల మోత మోగిస్తూ బాదుడు రెడ్డి అనే పేరుని సార్ధకం చేసుకున్నారని నారా లోకేష్ ఫైర్ అయ్యారు.

31 శాతం వ్యాట్ లీటర్ కు 4 రూపాయలు అదనపు వ్యాట్ లీట్ కు 1 రోడ్డు అభివృద్ధి ట్యాక్స్ ఇలా అన్ని కలిపి ప్రజలపై బాదుడు రెడ్డి భారం లీటర్ కు 30 రూపాయలని చెప్పారు.

వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్రోల్, డీజిల్ ధర తక్కువ ధరకే ఇవ్వొచ్చని నీతులు చెప్పిన బాదుడు రెడ్డి ఇప్పుడు పన్నులు ఎందుకు తగ్గించడం లేదో చెప్పాలని అన్నారు.

ఇతర రాష్ట్రాల పెట్రోల్ బంకుల్లో ఏపీ కంటే తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్ అంటూ బోర్డులు పెడుతున్నారని మీ దోపీడీ ఏ రేంజ్ లో ఉందో అర్ధమవుతుందని నారా లోకేష్ మండిపడ్డారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటకు కట్టుబడి రాష్ట్ర పన్నుల భారాన్ని తగ్గించాలని కోరారు నారా లోకేష్.

బిగ్ బాస్ 8 లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న నాగచైతన్య శోభిత… ఇదెక్కడి షాకింగ్ ట్విస్ట్!