పద్యాలు చెబితే పెట్రోల్ ఫ్రీ.. ఎక్కడో తెలుసా..?

దేశంలో పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న సంగతి తెలిసిందే.దేశంలోని పలు రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర 100 రూపాయలు దాటడంతో వాహనదారులు పెట్రోల్ కొనుగోలు చేయాలంటే ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది.

అయితే ఒక పెట్రోల్ బంకులో మాత్రం పద్యాలు చెబితే ఉచితంగా పెట్రోల్ పొందే అవకాశాన్ని కల్పిస్తున్నారు.

తమిళనాడు రాష్ట్రంలోని ఒక పెట్రోల్ బంక్ యజమాని ఇచ్చిన ఆఫర్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

తమిళనాడు రాష్ట్రంలోని ఒక సాహిత్య అభిమాని చిన్నారులు పద్యాలు చెబితే ఉచితంగా పెట్రోల్ ఇస్తామంటూ ప్రకటన చేశారు.

తమిళులు ఆరాధ్యించే వారిలో ఒకరైన తిరువళ్లువర్ తిరుక్కళర్ అనే గ్రంథాన్ని రచించారు.62 సంవత్సరాల వయస్సు ఉన్న సెంగువట్టల్ అనే పెట్రోల్ బంక్ యజమాని తిరుక్కళర్ అనే గ్రంథంలోని పద్యాలను చిన్నారులు చెబితే పెట్రోల్ ఫ్రీగా ఇస్తానంటూ ప్రకటన చేశారు.

ఒకటో తరగతి నుంచి ఇంటర్ సెకండియర్ వరకు చదువుతున్న విద్యార్థులు పద్యాలు చెప్పి ఉచితంగా పెట్రోల్ ను పొందవచ్చు.

20 పద్యాలు చెబితే ఒక లీటర్ పెట్రోల్, 10 పద్యాలు చెబితే అరలీటర్ పెట్రోల్ ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది.

ఈ ప్రకటన సోషల్ మీడియాలో తెగ వైరల్ కాగా చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు పద్యాలు నేర్పించి పెట్రోల్ బంక్ దగ్గరకు తీసుకొస్తున్నారు.

ఏప్రిల్ 30వ తేదీ వరకు ఈ విధంగా ఉచితంగా పెట్రోల్ ను పొందవచ్చు.

సెంగుట్టవన్ పిల్లల్లో సాహిత్యంపై అభిరుచి పెరిగే విధంగా చేస్తున్న ప్రయత్నంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

కరూర్ కు సమీపంలో ఉన్న వళ్లువర్ అనే పేరుతో ఉన్న ఈ పెట్రోల్ బంక్ కు జనం బారులు తీరుతుండటం గమనార్హం.

సెంగుట్టవన్ వళ్లువర్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్‌మెంట్‌ కు ఛైర్మన్ కూడా కావడం గమనార్హం.

ఓజీ మూవీ ఓటీటీ రైట్స్ లెక్క ఇదే.. పవన్ క్రేజ్ కు ఇంతకంటే ప్రూఫ్ కావాలా?