ఆలయ భూమికి నీటి వసతి కల్పించాలని కోరుతూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారికి వినతి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో గల శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం కు సంబంధించి ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామ శివారులో ఆలయంకు సంబంధించి ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఉందని ఇట్టి భూమిలో బోర్ వేసి నీటి వసతి కల్పించడం ద్వారా ఆలయం కు యాసంగి, వానా కాలం పంట ల కోసం బోర్ వేయించడం ద్వారా అలయంకు ప్రతి ఆరు నెలలకోసారి ఆదాయం వస్తుందని ఇట్టి ఆదాయం ద్వారా ప్రతి ఏటా జరిగే రథోత్సవానికి ఇట్టి ఆదాయం వినియోగించుకోవచ్చని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి ఆలయ కమిటీ సభ్యులు వివరించడం జరిగింది.

అదే విధంగా దేవాదాయ శాఖ నుండి ఆలయ పునర్ నిర్మాణం కోసం రావాల్సిన నిధులు కూడా ఇప్పించాలని కోరగా ఎన్నికల కోడ్ అనంతరం నిధులు మంజూరు కోసం కృషి చేస్తానని ఆయన అన్నారు.

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను కలిసిన వారిలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గడ్డం జితేందర్, వైస్ చైర్మన్ గంట వెంకటేష్ గౌడ్,ప్రధాన కార్యదర్శి ఒగ్గు బాలరాజు యాదవ్ ఆలయ కమిటీ సలహాదారు బుచ్చి లింగు సంతోష్ గౌడ్ లు పాల్గొన్నారు.

వైరల్ వీడియో: పెళ్లికి వెళ్లిన అతిధిలకు భారీగా డబ్బులతో ఉన్న గిఫ్ట్ కవర్..