డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని గాంధీ విగ్రహానికి వినతి పత్రం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు గడుస్తున్న మునిసిపల్ శాఖ మంత్రి ఈ జిల్లా మంత్రి అయినప్పటికీ ఈ జిల్లాల్లో ఉన్న రెండు ప్రధాన పట్టణాల్లో ఒకటి తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ పట్టణంలో ఇప్పటివరకు ఒక్క డబుల్ బెడ్రూం ఇంటి నిర్మాణం కాకపోవడం ఈ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం గతంలో పురపాలక సంఘం సాధారణ సమావేశాల్లో జిల్లా మంత్రికి స్థానిక ఎమ్మెల్యేకి డబుల్ బెడ్రూం ఇళ్ళ నిర్మాణం విషయంలో ఎన్నిసార్లు విన్నవించినా వారు చలించకపోవడం భారీ వర్షాల కారణంగా ఇల్లు లేని నిరుపేదలు అనేక ఇబ్బందులకు గురవుతున్న రాష్త్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈ రోజు పురపాలక సంఘం సాధారణ సమావేశం అనంతరం మున్సిపల్ కార్యాలయం ముందున్న మహాత్మా గాంధి విగ్రహానికి బిజెపి కౌన్సిలర్లు డబుల్ బెడ్రూం ఇల్లు( Double Bedroom House ) నిర్మానం చేపట్టి పేదలకు అందించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం మొద్దునిధ్ర వీడాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్ర అధికార పార్టీ నాయకులే రొడ్లెక్కి ధర్నాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడం కాదు ఏళ్లు గడుస్తున్న డబుల్ బెడ్రూం ఇల్ల నిర్మానం విషయంలో మీ చిత్తశుద్ధి నిరూపించుకుని పేదలకు డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మాణం చేసి అందించాలని లేని పక్షంలో బిజెపి పార్టీ పక్షాన ఆందోళనా కార్యక్రమాలు ఉంటాయని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి కౌన్సిలర్లు రేగుల సంతోష్ బాబు, ముప్పిడి సునంద, రామతీర్థం కృష్ణవేణి, అన్నారం ఉమా రాణి, గడ్డమీది లావణ్య, తిరుమల్ రెడ్డి కవిత రెడ్డి, నాయకులు, ముప్పిడి శ్రీనివాస్, అన్నారం శ్రీనివాస్, సుమంత్ రెడ్డి, హరీష్,శ్రీనివాస్ పాల్గొనడం జరిగింది.

హెయిర్ రూట్స్ ను సూపర్ స్ట్రాంగ్ అండ్ హెల్తీ గా మార్చే బెస్ట్ టానిక్ మీ కోసం!