కేసుల వివరాలపై ఏపీ హైకోర్టులో టీడీపీ నేతల పిటిషన్..!
TeluguStop.com
ఏపీ హైకోర్టులో( AP High Court ) లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది.
ఈ మేరకు తమపై నమోదైన కేసుల వివరాలు బహిర్గతం చేయాలని టీడీపీ( TDP ) నేతలు పిటిషన్ దాఖలు చేశారు.
ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్, నారాయణ, అచ్చెన్నాయుడు ( Chandrababu, Lokesh, Narayana, Achchennaidu )కోర్టులో పిటిషన్ వేశారు.
కాగా పిటిషన్ ను ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించింది.విచారణలో భాగంగా ఈ నెల 16వ తేదీ కల్లా పిటిషనర్లపై నమోదైన కేసుల వివరాలతో రావాలని ప్రభుత్వ తరపు న్యాయవాదికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
అనంతరం తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది.
నెల్సన్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ సినిమా చేస్తున్నాడా..?