టీఎస్ గవర్నర్‎పై సుప్రీంలో పిటిషన్.. ఈనెల 27న విచారణ

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‎పై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‎పై ఈనెల 27న విచారణ జరగనుంది.

ముఖ్య బిల్లులను ఆరు నెలలుగా పెండింగ్ లో పెట్టారని, వాటిని వెంటనే ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

పిటిషన్‎పై త్వరగా విచారణ చేపట్టాలని సీనియర్ అడ్వొకేట్ దుష్యంత్ దవే సుప్రీంకోర్టును కోరారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‎పై ఈనెల 27న విచారణ చేస్తామని వెల్లడించింది.