ఆసుపత్రిలో చేరిన యజమాని కోసం పెంపుడు శునకం ఏం చేసిందో తెలిస్తే?

మనుషుల కంటే ఎక్కువ నమ్మకంగా ఉండేది పెంపుడు కుక్కలు అనేవి మనమందరం అంగీకరించాల్సిన వాస్తవం.

ప్రస్తుత పరిస్థితులలో మనుషులు నమ్మకానికి ఎంతగా ప్రాధాన్యత ఇస్తున్నారో మనం రకరకాల సంఘటనలు చూస్తూనే ఉన్నాం.

మన ఇంట్లో మనుషులే అంతగా పట్టించుకునే పరిస్థితులు నేడు నెలకొన్నాయి.కాని ఇంట్లో ఎవరు ఎలా ఉన్నా ఇంట్లో పెంచుకున్న పెంపుడు కుక్కకు ఇంటి యజమాని ఎంత ప్రేమ చూపిస్తుందో మనకు తెలుసు.

అచ్చం ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది.తాజాగా ఈ ఘటన టర్కీలో చోటు చేసుకుంది.

ఆ యజమాని అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరితే తన యజమాని ఆరోగ్యం బాగుపడేంత వరకు, యజమాని బయటకు వచ్చేంతవరకు ఆసుపత్రి వద్దే వేచి చూసింది.

ఇక అసలు విషయంలోకి వెళ్తే ట్రాబ్ జోన్ ప్రాంతానికి చెందిన సెమల్ సెంటర్క్ అనే వ్యక్తి తన ఇంట్లో బోన్కుక్ అనే కుక్కను పెంచుకుంటున్నారు.

అయితే అతనికి కొంచెం అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రిలో చేరారు.ఇక తన యజమాని బాగయ్యేంత వరకు ఆ పెంపుడు శునకం చూపిన ప్రేమ ఇప్పుడు వైరల్ అవుతోంది.