యజమానికి కుక్క భాష ఎలా మాట్లాడాలో నేర్పిస్తున్న శునకం.. వీడియో వైరల్..
TeluguStop.com
కొన్ని కుక్కలు ( Dogs ) చాలా తెలివిగా ప్రవర్తిస్తాయి.ఇవి తమ స్మార్ట్‌నెస్‌తో ప్రజలను ఆశ్చర్యపరుస్తుంటాయి.
తాజాగా ఒక కుక్క కూడా తన తెలివి ప్రదర్శిస్తూ అందరి మనసులను గెలుచుకుంటోంది.
వివరాల్లోకి వెళితే, హ్యూగో ద మలామ్యూట్( Hugo The Malamute ) అనే కుక్క తన యజమానికి కుక్క భాష ఎలా మాట్లాడాలో నేర్పేందుకు ప్రయత్నిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ క్యూట్ వీడియోను కుక్కలకు డెడికేట్ చేసిన ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో వీడియో పోస్ట్ చేశారు.
"""/" /
వీడియోలో హ్యూగో, అతని యజమాని ఒకరికొకరు ఎదురుగా నేలపై కూర్చున్నట్లు మనం చూడవచ్చు.
హ్యూగో తన యజమానితో కమ్యూనికేట్ చేయడానికి వివిధ శబ్దాలు, గెస్చర్స్ చేస్తూ అది లాంగ్వేజ్ ఎలా నేర్చుకోవాలో యజమానికి గైడెన్స్ ఇస్తోంది.
అతను తన కుక్క మాట్లాడినట్లు( Dog Language ) మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు.అయినప్పటికీ, హ్యూగో తన యజమాని ప్రయత్నాలతో సంతృప్తి చెందలేదు.
అతని ఛాతీపై తన పంజాను ఉంచి, అతని ముఖాన్ని నొక్కడం ద్వారా, బిగ్గరగా మొరగడం ద్వారా తన నిరాశను వ్యక్తం చేసింది.
"""/" /
ఈ వీడియో 36 లక్షలకు పైగా వ్యూస్, లక్షకు పైగా లైకులు వచ్చాయి.
ఈ వీడియో చూసి చాలామంది ముచ్చట పడుతున్నారు.హ్యూగోకు తన విద్యార్థి పట్ల కొంచెం కూడా ఓపిక కలిగి లేదని ఒక యూజర్ చమత్కరించారు.
హ్యూగో, దాని యజమాని మధ్య బంధాన్ని ఒకరు ప్రశంసించారు.వీడియో తమను చాలా నవ్వించిందని చెప్పారు.
హ్యూగో తన ఆప్యాయత, అధికారాన్ని చూపించడానికి నిజమైన స్నేహితుడిలా తన పాదాలను ఉపయోగించిన తీరు తమను ఆకట్టుకుందని మరికొందరు వ్యాఖ్యానించారు.
ఇక మిగతా కుక్కల యజమానులు కూడా రిప్లై ఇస్తూ తాము కూడా ఇలా కుక్కలతో మాట్లాడడానికి ప్రయత్నిస్తామని చెప్పుకొచ్చారు.
అమోఘం.. కొన్న సరుకులకు క్యారీ బ్యాగ్ ఇవ్వలేదని ఏకంగా?(వీడియో)