ట్రైకోడెర్మా విరిడి తో పంటలకు ఆశించే తెగుళ్ళకు చెక్..!

పంటలకు భూమి ద్వారా ఆశించే శిలీంద్రపు తెగుళ్ళ వల్ల దాదాపుగా 30 శాతానికి పైగా దిగుబడిను రైతులు నష్టపోతున్నారు.

ముఖ్యంగా భూమి నుంచి పంటలకు ఎండు తెగుళ్లు, వేరుకుళ్ళు తెగుళ్లు ఆశిస్తే పంట మొత్తం దాదాపుగా నాశనం అయినట్టే.

అయితే రైతులు ఈ తెగుళ్ల నివారణ( Pests Prevention ) కోసం అధిక మోతాదులో రసాయన పిచికారి మందులను ఉపయోగించడం వల్ల పర్యావరణం కలుషితం అవడంతో పాటు నాణ్యమైన దిగుబడులు పొందలేకపోతున్నారు.

ఈ తెగుళ్లను ట్రైకోడెర్మా విరిడితో( Trichoderma Viride ) చాలా సులభంగా అరికట్టవచ్చని వ్యవసాయ క్షేత్ర నిపుణులు చెబుతున్నారు.

ట్రైకోడెర్మా విరిడి అనేది బూజు జాతికి చెందిన ఒక శిలీంద్ర నాశిని.ఇది పంటలకు హాని కలిగించే శిలింద్రాలను ఆశించి, నిర్మూలిస్తుంది.

ఈ ట్రైకోడెర్మా విరిడి తెల్లటి పొడి రూపంలో మార్కెట్లో వివిధ రకాల పేర్లతో అందుబాటులో ఉంది.

ఈ ట్రైకోడెర్మా విరిడి ను పశువుల ఎరువులో( Cattle Manure ) కలిపి భూమిలో తేమ ఉన్నప్పుడు దుక్కిలో వెదజల్లాలి.

దీంతో భూమి ద్వారా వ్యాప్తి చెందే సిలింద్రపు తెగుళ్లు దాదాపుగా నాశనం అవుతాయి.

"""/" / పప్పు జాతి పంటల విత్తనాలు, పత్తి విత్తనాలను ఈ ట్రైకోడెర్మా విరిడితో విత్తనశుద్ధి( Seed Purification ) చేస్తే, విత్తనం ద్వారా వ్యాపించే శిలీంద్రాలను సమర్ధంగా అరికట్టవచ్చు.

ఈ ట్రైకోడెర్మా విరిడిని మొలాసిస్ లేదా ఈస్ట్ ను మాధ్యమంగా వాడి పులియపెట్టే పద్ధతి ద్వారా ఫెర్మంటర్ తో ట్రైకోడెర్మాను అభివృద్ధి చేస్తారు.

ఈ ట్రైకోడెర్మా విరిడిను పశువుల ఎరువులో కలిపి ఎలా వృద్ధి చేయాలంటే.90 కిలోల పశువుల ఎరువులో 10 కిలోల వేపపిండి కలపాలి.

"""/" / దీనిపై ఒకటి నుండి రెండు కిలోల ట్రైకోడెర్మా విరిడిని పొరలు పొరలుగా చల్లాలి.

ఒక కిలో బెల్లాన్ని కలిపిన నీటిని పశువుల ఎరువుపై చల్లాలి.తేమ ఆవిరి కాకుండా గోనెపట్టాలు కప్పి ఉంచాలి.

రోజు నీరు చిలకరించాలి.ఏడు నుండి పది రోజుల్లో ట్రైకోడెర్మా శిలీంద్రం ఎరువు అంతా వ్యాపిస్తుంది.

గోనే పట్టాలు తొలగిస్తే పశువుల ఎరువుపై తెల్లటి బూజును గమనించవచ్చు.ఈ ట్రైకోడెర్మావిరిడి ను పొలంలో తేమ ఉన్నప్పుడు సమానంగా వెదజల్లితే పంటలకు వివిధ రకాల తెగుళ్ల నుండి సంరక్షించుకున్నట్టే.

అలా జరగడం నా పూర్వజన్మ సుకృతం.. నందమూరి బాలకృష్ణ కామెంట్స్ వైరల్!