అల్లం సాగులో చీడపీడల నివారణ.. సరైన సస్యరక్షక పద్ధతులు..!

పలు రకాల పంటలలో అంతర పంటగా అల్లం ( Ginger ) అధిక విస్తీర్ణంలో సాగు అవుతోంది.

తేమతో కూడిన వాతావరణం అల్లం సాగుకు( Ginger Cultivation ) అనుకూలంగా ఉంటుంది.

కానీ నీరు నిలువ ఉండే నేలలు అల్లం సాగుకు పనికిరావు.చీడపీడల బెడదను నివారించాలంటే ఆరోగ్యకరమైన దుంపలను ఎంచుకోవాలి.

విత్తుకునే ముందు విత్తన శుద్ధి చేయడం తప్పనిసరి.అల్లం సాగుకు ఆశించే చీడపీడలు ( Pests ) ఏంటో.

? వాటిని ఎలా గుర్తించి అరికట్టాలో తెలుసుకుందాం.h3 Class=subheader-styleఆకుమాడు తెగులు:/h3p నేలను తాకే ఆకులపై ఆకుపచ్చ రంగులో నీటిమచ్చలు ఏర్పడి తరువాత గోధుమ రంగులోకి మారి, ఆకు తొడిమెలకు వ్యాప్తి చెంది ఆకులు మాడిపోతాయి.

ఈ తెగుల నివారణకు లీటరు నీటిలో ఒక మిల్లీలీటరు ప్రాపికొనజోల్ కలిపి ఆకులు మొత్తం తడిచేలాగా పిచికారి చేయాలి.

H3 Class=subheader-styleవేరు పురుగు:/h3p ఈ పురుగులు దుంపల మొదళ్ళలో ఉండే వేర్లను కత్తిరిస్తాయి.

దీంతో తీవ్ర నష్టం ఎదుర్కోవాల్సి ఉంటుంది.ఈ పురుగుల నివారణకు ఐదు కిలోల ఫోరేట్ గుళికలను మొక్కల మొదళ్ళ వద్ద వేసి ఈ పురుగులను నియంత్రించాలి.

"""/" / H3 Class=subheader-styleపోలుసు పురుగు: /h3pఈ పురుగులు అల్లం విత్తన దుంపలను ఆశించి పూర్తిగా రసాన్ని పీల్చేస్తాయి.

కాబట్టి ఈ పురుగుల నివారణకు లీటరు నీటిలో ఐదు మిల్లీలీటర్ల మలాథాయాన్ కలిపి, ఈ ద్రావణంలో 30 నిమిషాలు విత్తన దుంపలను నానబెట్టి ఆ తర్వాత కాస్త ఆరిన వెంటనే పొలంలో విత్తుకోవాలి.

"""/" / H3 Class=subheader-styleమొవ్వు తొలుచు పురుగు:/h3p ఈ పురుగులు అల్లం మొక్క మొవ్వను పూర్తిగా తొలిచేస్తాయి.

వీటిని నివారించడంలో ఆలస్యం అయితే తీవ్ర నష్టం వాటిల్లుతుంది.ఈ పురుగుల నివారణకు లీటరు నీటిలో 2మి.

లీ డైమిథోయేట్ + 1మి.లీ సాండోవిట్ కలిపి పిచికారి చేయాలి.

లేదంటే లీటర్ నీటిలో 2మి.లీ క్వినాల్ ఫాస్ + 1మి.

లీ సాండోవిట్ కలిపి మొవ్వు ఆకులు పూర్తిగా తడిచేలా పిచికారి చేయాలి.

అమెరికాలో హైదరాబాద్ యువకుడు దారుణ హత్య..