తిక్కాకు మచ్చ తెగులు నుండి వేరుశనగ పంటను సంరక్షించుకునే పద్ధతులు..!

వేరుశనగ పంట రబీ కాలంలో అధిక విస్తీర్ణంలో సాగు అవుతోంది.రెండు తెలుగు రాష్ట్రాలలో అధిక విస్తీర్ణంలో సాగుతున్న నూనె గింజల పంటలలో వేరుశనగ( Groundnut ) ప్రధానమైనది.

వేరుశనగ పంటకు చీడపీడల బెడద చాలా ఎక్కువ.సకాలంలో వీటిని గుర్తించి సస్యరక్షక పద్ధతులు పాటించకపోతే తీవ్ర నష్టం ఎదుర్కోవాల్సి ఉంటుంది.

తిక్కాకు మచ్చ తెగుల ( Tikka Leafspot )వల్ల వేరుశనగ పంట మొత్తం నాశనం అవుతుంది.

పంటవేసిన 30 రోజులలోపు ఈ తెగలు పంటను ఆశిస్తాయి.కాబట్టి ఈ తెగులను ఎలా నిర్ధారించాలి.

ఎలా సమర్ధవంతంగా నివారించాలో తెలుసుకుందాం. """/" / వేరుశనగ పంట వేసిన 30 రోజుల తరువాత లేత ఆకులపై మచ్చలు ఏర్పడి ముదురు గోధుమ వర్ణంలోకి మారతాయి.

తరువాత ఆకులు పసుపు రంగు లోకి పూర్తిగా మారి వాలిపోతాయి.ఇలా జరిగితే వీటిని తిక్కాకు మచ్చ తెగులుగా నిర్ధారించుకోవాలి.

ఒకవేళ మొక్కకు ఆలస్యంగా వస్తున్న ఆకులో నల్లని మచ్చలు ఏర్పడి, మొక్క కాండనికి వ్యాప్తి చెందుతాయి.

ఆకుమచ్చ తెగుల ఉద్రిక్తత పెరిగే కొద్దీ ఆకులు రాలిపోవడం పెరిగి పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోతుంది.

"""/" / ఈ తెగుల వ్యాప్తికి ప్రధాన కారణం విత్తన శుద్ధి ( Seed Selection )చేయకుండా నేరుగా పొలంలో విత్తుకోవడమే.

కాబట్టి ఎటువంటి విత్తనాలనైనా ముందుగా విత్తన శుద్ధి చేసుకోవాలి.ఎప్పటికప్పుడు పంటను గమనిస్తూ ఈ తెగుల లక్షణాలు కనిపిస్తే వెంటనే పిచికారి మందులతో నివారణ చర్యలు చేపట్టాలి.

ఒక లీటరు నీటిలో ఒక మిల్లీలీటర్ టేబ్యుకొనజోల్ కలిపి పిచికారి చేయాలి.

రెండు రోజుల తర్వాత ఒక లీటర్ నీటిలో రెండు గ్రాముల క్లోరోధలోనిల్ అనే శిలీంద్ర నాశిని కలిపి పిచికారి చేయడంతో తెగుల ఉద్రిక్తత తగ్గుతుంది.