వైరల్: ఫేమస్ కావాలని ఆరాటపడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు, పాపం!

వెర్రి జనాలు, వింత ప్రయత్నాలు, పిచ్చి పోకడలు.ఇదంతా ఇపుడు ఎందుకని అనుకుంటున్నారా? నేటితరానికి వేపకాయంత వెర్రి, పుచ్చకాయంత పిచ్చి ఉండాలి చాలా సందర్భాలలో నిరూపిస్తున్నారు.

ఇక తాజాగా వైరల్ అవుతున్న వీడియో చూస్తే మీరు కూడా ఈ నానుడి నిజమే అని అంటారు.

స్మార్ట్ ఫోన్( Smart Phone ) అనేది ప్రతి ఒక్కటి చేతిలోకి వచ్చాక.

ఈ సోషల్ మీడియా( Social Media ) వినియోగం విరివిగా పెరిగింది.దాంతో సహజంగానే ఎవరికి తోచినట్టు వారు రీల్స్ అని, షార్ట్స్ అని తెగ రెచ్చిపోయి చేస్తున్నారు.

అయితే ఈ క్రమంలో కొంతమంది ప్రాణాలను కూడా లెక్కచేయక పోవడం బాధాకరం. """/" / అవును, కొంతమంది ఔత్సాహికులు సెల్ఫీ, రీల్ వీడియోల కోసం తమ ప్రాణాలను రిస్క్‌లో పడేసుకుంటున్నారు.

ప్రమాదమని తెలిసినా కూడా ససేమిరా వెనక్కి తగ్గడం లేదు.ఇదే కోవలో ఇప్పటికే ఎన్నో సంఘటనలు జరిగాయి.

ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు కూడా.తాజాగా మరో సంఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

ఒక హిల్ స్టేషన్( Hill Station ) ప్రాంతంలో ఓ వ్యక్తి ఫ్లిప్ చేస్తూ వీడియో ట్రై చేసాడు.

కానీ, ఆ తర్వాత అతడు ఊహించని విధంగా అదుపు తప్పి ప్రమాదానికి గురయ్యాడు.

"""/" / నో కాంటెక్స్ట్ హ్యూమన్స్ అనే ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేయబడిన ఈ వీడియోను ఇప్పటివరకు 8.

2 మిలియన్ల మంది చూడడం కొసమెరుపు.అంతేకాకుండా 75వేలకు పైగా లైక్స్ రావడం విశేషం.

ఇక కామెంట్లకైతే లెక్కేలేదు.ఓ రేంజులో మనోడికి యేసుకుంటున్నారు.

ఎనిమిది సెకండ్ల నిడివి గల ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

పాపులారిటీ కోసం ఎంత దారుణానికైనా తెగిస్తారా? ప్రమాదకరమైన స్టంట్స్ చేసే వారికి ఇదోక గుణపాఠం అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.