పిడుగుపడి వ్యక్తికి తీవ్ర గాయాలు

నల్లగొండ జిల్లా:పిడుగు( Lightning ) పడి వ్యక్తికి తీవ్రగాయాలైన సంఘటన వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామంలో చోటు చేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.ఆమనగల్లు గ్రామానికి చెందిన బయ్య వెంకన్న వృత్తిరీత్యా గొర్ల కాపరి,రోజు మాదిరిగానే గొర్లను కాయడానికి వెళ్ళగా అకస్మాత్తుగా కురిసిన వర్షానికి గొర్రెలను కాస్తున్న పరిసర ప్రాంతంలో పిడుగు పడడంతో వెంకన్నకు తీవ్ర గాయాలయ్యాయి.

స్థానికులు 108 సహాయంతో సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

వైరల్ వీడియో: ఇవే తగ్గిచుకుంటే బాగుపడతారు.. ముంబై లోకల్ ట్రైన్‌లో డేంజర్ స్టంట్..