ఆగకుండా ఎక్కిళ్లు వస్తున్నాయా? కరోనా కొత్త లక్షణమే!
TeluguStop.com
అదేంటి.అని షాక్ అవుతున్నారా? షాక్ అవ్వడంలో సందేహం లేదు.
కానీ కొత్త కొత్త లక్షణాలు అన్ని బయటకు వస్తున్నాయి.నాలుగురోజుల పాటు నిరంతరాయంగా మీకు ఎక్కిళ్లు వస్తే అప్రమత్తం అయ్యి కరోనా పరీక్ష చేయించుకోవడం మంచిదని వైద్యులు చెప్తున్నారు.
కరోనాకు సంబంధించిన ఇతర లక్షణాలు లేకపోయినప్పటికీ అసాధారణంగా నాలుగు రోజులు ఎక్కిళ్లు వచ్చిన వ్యక్తి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు వైద్యులు.
కరోనా వైరస్ ఉంటేనే ఇలా అసాధారణమైన ఎక్కిళ్లు వస్తాయని అంటున్నారు.పూర్తి వివరాల్లోకి వెళ్తే.
చికాగోకు చెందిన 62 ఏళ్ల వ్యక్తి ఏప్రిల్ నెలలో ఆస్పత్రిలో చేరాడు.అతడిలో ఒక్కసారిగా బరువు తగ్గడం మొదలవ్వడం వైద్యులు గుర్తించారు.
అనంతరం అతడికి టెస్ట్ చెయ్యగా కరోనా పాజిటివ్ వచ్చింది.అయితే అతడికి కరోనా వైరస్ కు సంబందించిన ఏ ఒక్క లక్షణం లేదు.
కేవలం డయాబెటిస్ మాత్రమే ఉంది.జ్వరం కానీ గొంతునొప్పి కానీ జలుబు, దగ్గు ఇలాంటివి ఏవి లేవు.
ఆ బాధితుడుకి కేవలం నాలుగు రోజులు నిరంతరాయంగా ఎక్కిళ్లు వచ్చాయి.ఆ ఎక్కిళ్లు రావడం అసాధారణమైన లక్షణం.
కరోనా వైరస్ టెస్ట్ చేయించుకోగానే అతడికి పాజిటివ్ వచ్చింది.దీంతో కరోనా వైరస్ అసాధాణంగా వచ్చే ఎక్కిళ్లు కూడా ఒక లక్షణమే అని వైద్యులు తెలిపారు.
వైరల్: స్తన్యం పట్టుకొని మరీ వీధి కుక్కపాలు తాగిన యువతి.. కారణం ఇదే!