పేర్ని కిట్టు అసాంఘిక శక్తి..: మాజీ మంత్రి కొల్లు రవీంద్ర
TeluguStop.com
వైసీపీ యువనేత పేర్ని కిట్టుపై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు.
పేర్ని కిట్టు అసాంఘిక శక్తి అని ఆరోపించారు.మచిలీపట్నంలో కిట్టు గంజాయి బ్యాచ్ ను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు.
గుడివాడలో పేర్ని కిట్టు క్యాసినో నిర్వహించారని కొల్లు రవీంద్ర ఆరోపణలు చేశారు.పేకాట, జూదం నడుపుతూ యువత భవిష్యత్ ను నాశనం చేస్తున్నారని పేర్కొన్నారు.
బందరును మాజీ మంత్రి పేర్ని నాని అభివృద్ధి చేయలేదన్నారు.ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో తండ్రీకొడుకులకు ప్రజలు తగిన బుద్ది చెప్తారని తెలిపారు.
అల్లు, మెగా ఫ్యామిలీలు కలిసిపోయినట్టేనా.. ఈ కుటుంబాల మధ్య గ్యాప్ తగ్గుతుందా?