అనుమతులు లేనీ ఇటుక బట్టీలకు మట్టి తోలకాలు…?

సూర్యాపేట జిల్లా: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2010 డబ్ల్యూయుపి నెంబర్ 26243.2007 ప్రకారం అప్పటి ప్రభుత్వం ఇటిక బట్టీల ఏర్పాటుకు నిబంధనలు పాటించాలని అధికారులకు ఆర్డర్ జారీ చేసింది.

పర్యావరణ శాఖ (పొల్యూషన్ బోర్డ్)తో పాటు జిల్లా కలెక్టర్,పలు శాఖల అధికారులకు ఇటుక బట్టీల ఏర్పాటుకై నియమ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని చెపింది.

ఆ జీవో ప్రకారం గ్రామ పంచాయితీ పరిధిలో ఇటుక బట్టీలకు ఎటువంటి అనుమతులు ఉండవు.

తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018( Telangana Panchayat Raj Act 2018 ) కి సంబంధించి గ్రామపంచాయతీలకు బాధ్యతలు మోపలేదు.

ఇటుక బట్టీల ఏర్పాటుకై వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా అనుమతులు జారీ చేయబడలేదని పంచాయితీ అధికారులే చెప్తున్నారు.

తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 ప్రకారం ఇటుక బట్టీలపై చర్యలు తీసుకునే అధికారాలు కట్టబెట్టలేదాని ఆర్డర్ ద్వారా తెలుస్తోంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్డర్ ప్రకారం ఇటుక బట్టీలు ఏర్పాటు చేసుకోవాలంటే గ్రామానికి దూరంగా పాఠశాలలు,హాస్పటల్స్, నేషనల్ హైవేకి 200 మీటర్లు,విలేజ్ రోడ్లకు 25 మీటర్లు,చెరువు,కుంటలకు 50 మీటర్ల దూరం ఉండేలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh )జారీ చేసిన సర్కులర్ ప్రతి గ్రామపంచాయతీలో ఉన్నప్పటికీ చర్యలు తీసుకునే అధికారాలు మాత్రం తమకు లేవని చెబుతూ,ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతూ ఇటుక వ్యాపారులకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

పొల్యూషన్ బోర్డ్,జిల్లా కలెక్టర్,తాహాసిల్దార్ లకు నిబంధనలకు విరుద్ధంగా వెలిసిన ఇటుక బట్టీలపై చర్యలు తీసుకునే అధికారాలు కట్టబెట్టింది.

అయినా సదరు అధికారులు చట్టవిరుద్ధంగా గ్రామానికి దగ్గరలో రోడ్ల పక్కనే ఉన్న ఇటుక బట్టీలపై చర్యలు తీసుకోవడంలో కాలయాపన చేస్తున్నారు.

హుజూర్ నగర్( Huzur Nagar _ నియోజకవర్గంలోని పాత నేరేడుచర్ల,దర్శించర్ల, నరసయ్యగూడెం ఇటిక బట్టీలకు రాత్రి పగలు తేడా లేకుండా టిప్పర్ల సహాయంతో మట్టిని తరలిస్తున్నారు.

హుజూర్ నగర్ మండల పరిధిలోని బూరుగడ్డ చెరువు నుండి జెసిబి మిషన్ల సహాయంతో మట్టిని తీసి ట్రాక్టర్ల ద్వారా గోపాలపురంలోని ఇటుక బట్టిలకు తరలిస్తున్నారు.

ఇంత దందా కొనసాగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.అసలు అనుమతులు లేని ఇటుక బట్టీలకు అక్రమ మట్టి తోలకాలు ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

నాగ్ అశ్విన్ ఫ్యామిలీ ఆ ఊరిలో సాయిబాబా ఆలయాన్ని నిర్మించిందా. గ్రేట్ అంటూ?