పరిశ్రమల స్థాపనకు అనుమతులు త్వరితగతిన మంజూరు చేయాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే వారికి ఔత్సాహికులకు సకాలంలో అనుమతులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు.

సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించి, పరిశ్రమలకు అనుమతుల మంజూరు, తదితర అంశాలపై కమిటీ సభ్యులతో కలిసి చర్చించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ టీఎస్ఐపాస్ ద్వారా దరఖాస్తు చేసుకున్న పరిశ్రమల యొక్క వివరాలను, అర్హతలను క్షుణ్ణంగా పరిశీలించి, సకాలంలో అనుమతులు ఇవ్వాలని, పరిశ్రమల స్థాపన ద్వారా నిరుద్యోగులకు, స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు.

వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించాలని కలెక్టర్ అన్నారు.ఇప్పటివరకు సకాలంలో పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేసినందుకు అధికారులను అభినందించారు.

ఈ సందర్భంగా టీ ప్రైడ్ లో భాగంగా రవాణా వాహనాల కొనుగోలుకు గాను 19 మంది ఎస్సీ అభ్యర్థులకు 63 లక్షల 33 వేల రూపాయలు, 11 ఎస్టీ అభ్యర్థులకు 38 లక్షల 58 వేల రూపాయలను మంజూరు చేశారు.

ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ బి సత్య ప్రసాద్, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ఉపేందర్ రావు, ఎల్ డి ఎం మల్లి ఖార్జున్ , అర్టీఓ కొండల్ రావు, కార్మిక, సెస్, కాలుష్య నియంత్రణ మండలి,టి ఎస్ ఎస్ ఐ ఐ సి టౌన్ ప్లానింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

పాస్‌పోర్ట్‌లో థాయ్‌లాండ్‌ ట్రిప్ వివరాలు చెరిపేసిన యువతి.. కట్ చేస్తే దిమ్మతిరిగే షాక్..?