నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు లభించని అనుమతి
TeluguStop.com
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టనున్న యువగళం పాదయాత్రకు అనుమతి ఇంకా లభించలేదు.
ఈనెల 12న ఏపీ డీజీపీ, హోం సెక్రటరీతో పాటు చిత్తూరు ఎస్పీ, డీఎస్పీలకు పాదయాత్రకు అనుమతిని ఇవ్వాలని కోరుతూ టీడీపీ లేఖలు రాసింది.
అయితే టీడీపీ లేఖలపై అధికారులు ఇంతవరకు స్పందించలేదు.మరోవైపు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా యువగళం పాదయాత్రను నిర్వహించి తీరుతామని టీడీపీ స్పష్టం చేసింది.
కాగా ఈనెల 27 న లోకేశ్ పాదయాత్ర ప్రారంభం కానుందన్న విషయం తెలిసిందే.
పెదాల నలుపును పోగొట్టే పవర్ ఫుల్ రెమెడీ ఇది.. డోంట్ మిస్..!