తిరుపతిలో అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ?

రాష్ట్రంలో కరోనా వేగంగా విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వం తిరుపతి వెళ్లేవారికి నిబంధనలు కఠినం చేసింది.

తిరుపతిలో లాక్ డౌన్ అమలును మరికొద్ది రోజుల వరకు పొడిగించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇప్పటికే వేలల్లో కేసులు నమోదవుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుందని, ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించి సహకరించాలని అధికారులు కోరుతున్నారు.

నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.తిరుపతిలో లాక్ డౌన్ ఈ నెల 31వ తేదీ వరకు అమలులో ఉంటుందని అధికారులు తెలిపారు.

ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు షాపులకు అనుమతి ఉంటుందని, అందులో అత్యవసర సేవలు, మెడికల్ షాపులు మాత్రమే ఓపెన్ ఉంటాయన్నారు.

ప్రైవేట్ వాహనాల్లో తిరుపతి దేవస్థానానికి వెళ్లాలని అనుకునే వారు బైపాస్ రోడ్డు మార్గంలో వెళ్లాలని ఎస్పీ సూచించారు.

బైకులపై కేవలం ఒకే వ్యక్తికి పర్మిషన్ ఉంటుందని తెలిపారు.తిరుపతిలో శనివారం ఒక్క రోజే 959 కేసులు నమోదు కాగా 10 మంది కరోనా బారిన పడి చనిపోయారు.

జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండటంతో లాక్ డౌన్ ను ఈ నెలాఖరు వరకు పొడిగించామని అధికారులు తెలిపారు.

నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలతో పాటు జరిమానా విధించడం జరుగుతుందని అధికారులు హెచ్చరించారు.

కదులుతున్న బైక్‌పై పుష్‌అప్‌లు.. వీడియో వైరల్‌