6 బంతుల్లో 6 సిక్సర్లతో విరుచుకుపడ్డ పెరిరా..!

ఒక్క ఓవరులో 2-3 సిక్సర్లు కొట్టాలి అంటే చాలా కష్టం.అలాంటిది కొందరు బ్యాట్స్‌మెన్లు ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టి క్రికెట్ అభిమానులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నారు.

ఇటీవల శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్లో వెస్టిండీస్ ఆటగాడు కీరన్ పోలార్డ్ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టడం ప్రేక్షకులు ఇంకా మర్చిపోలేదు కానీ మళ్ళీ ఇంకొక బ్యాట్స్‌మ్యాన్‌ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టి ఆశ్చర్య పరిచారు.

వివరంగా తెలుసుకుంటే మేజర్ క్లబ్స్ లిమిటెడ్ ఓవర్ లిస్ట్-ఎ టోర్నమెంట్ లో టీ20 మ్యాచ్ లు జరుగుతున్నాయి.

ఈ క్లబ్ స్థాయి క్రికెట్ లో శ్రీలంక ఆర్మీ స్పోర్ట్స్ క్లబ్ కి ఆల్ రౌండర్ తిసారా పెరీరా కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు.

అయితే ఆదివారం నాడు జరిగిన మ్యాచ్ లో ఆయన ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టి ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన మొదటి శ్రీలంకన్ క్రికెటర్ గా రికార్డు సృష్టించారు.

అన్ని క్రికెట్ ఫార్మాట్లలో అరుదైన ఫీట్ సాధించిన ఆటగాడిగా తిసారా పెరీరా చరిత్ర సృష్టించారు.

,/br 13 బంతుల్లో 52 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచిన అతను ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన రెండవ శ్రీలంకన్ క్రికెటర్ గా ఒక రికార్డు నెలకొల్పారు.

నవంబర్ 2005 లో రాగానా క్రికెట్ క్లబ్ తరుపున ఆడిన ఆల్ రౌండర్ కౌశల్య వీరరత్నే కురుణేగాల యూత్ క్రికెట్ క్లబ్‌ పై 12 బంతుల్లో అర్ధ సెంచరీ చేశారు.

18 బంతుల్లో 66 పరుగులు చేసిన ఆయన రెండు ఫోర్లు , ఎనిమిది సిక్సర్లు కొట్టారు.

"""/"/ 20వ ఓవర్ పూర్తికావడానికి ఇంకా 20 బాల్స్ మిగిలి ఉండగా ఐదవ స్థానంలో బ్యాటింగ్ కు దిగిన తిసారా పెరీరా ఆఫ్-స్పిన్ బౌలర్ దిల్హాన్ కూరే బౌలింగులో వరుసగా సిక్సర్లు కొట్టారు.

దీంతో నాలుగు ఓవర్లు బౌల్ చేసిన దిల్హాన్ కూరే 73 పరుగులు ఇచ్చుకోవాల్సి వచ్చింది.

ఇకపోతే ఇప్పటి వరకు క్రికెట్ లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లు ఎవరో తెలుసుకుంటే మొదటిగా సర్ గార్ఫీల్డ్ సోబర్స్ 1968 లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టారు.

ఆయన తర్వాత రవిశాస్త్రి 1985 లో ఈ ఘనతను సాధించారు.హెర్షెల్ గిబ్స్ 2007 లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టగా అదే సంవత్సరంలో ఇండియన్ మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఆరు బాల్స్ లో ఆరు సిక్సర్లు కొట్టారు.

ఇక ఆ తరువాత రాస్ వైట్లీ, హజ్రతుల్లా జజాయ్, లియో కార్టర్ కీరోన్ పొలార్డ్, తిసారా పెరీరా ఆటగాళ్ళు ఈ అరుదైన ఫీట్ ని ఛేదించి తమకంటూ ఒక స్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు.

రామ్ కు స్టార్ డమ్ తెచ్చిన సినిమాలను మర్చిపోతున్నాడా..?