ప్రభాస్ స్పీడ్ కు ఇతర హీరోలు ఈర్ష్య పడుతున్నారా.. ఈ స్పీడ్ కు ఎవరూ సాటిరారుగా!
TeluguStop.com
మామూలుగా ఒకరు ఎదుగుతుంటే చూసి మరొకరు కుళ్ళు కోవడం ఈర్ష్య పడడం అన్నది కామన్.
ఇది అన్ని రంగాల వారికి వర్తిస్తుందని చెప్పవచ్చు.సినిమా ఇండస్ట్రీలో కూడా అదే విధంగా ఒక సెలబ్రిటీ ఎదుగుతున్నారు అంటే మరొక సెలబ్రిటీలు ఈర్ష్య పడుతూ ఉంటారు.
కాకపోతే బయటపడరు అంతే.ఇది అన్ని ఇండస్ట్రీలలోనూ ఉన్నదే.
కానీ ప్రభాస్( Prabhas ) విషయంలో మాత్రం అందరి అభిమానులు కుళ్ళు కుంటున్నారని చెప్పాలి.
అందుకు గల కారణం కూడా లేకపోలేదు.టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతుండడంతో పాటు వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు నటిస్తుండడంతో ఇతర సెలబ్రిటీలు అలాగే హీరోల అభిమానులు కూడా కుళ్లుకుంటున్నారు.
"""/" /
బాహుబలి( Baahubali ) సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ఆ సినిమా తర్వాత నటిస్తున్న ప్రతి ఒక్క సినిమా కూడా పాన్ ఇండియా సినిమా కావడం విశేషం.
అలాగే ప్రభాస్ చేతిలో ప్రస్తుతం నాలుగైదు సినిమాలు ఉండగా ఆ సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే.
కాగా ప్రస్తుతం రెండేళ్లకు ఒక సినిమా చేయడమే గగనంగా మారిపోతున్న ట్రెండ్ లో ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ చేస్తున్న ప్రభాస్ స్పీడ్ చూస్తుంటే ముచ్చట వేయక మానదు.
కాగా ఇటీవల ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడి( Kalki 2898 AD ) సినిమా విడుదల అయి బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన విషయం తెలిసిందే.
ఈ సినిమా ఇంకా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతూనే ఉంది.దాంతో ప్రభాస్ అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
ఈ హ్యాపీనెస్ ని మరింత పెంచుతూ ప్రభాస్ నెక్స్ట్ సినిమా అయినా ది రాజా సాబ్( The Rajasaab ) సినిమా అప్డేట్స్ మొదలు పెట్టేసారు మూవీ మేకర్స్.
"""/" /
దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.తాజాగా చిన్న గ్లిమ్స్ వదలబోతున్నారు వార్త సోషల్ మీడియాని ఒక్కసారిగా ఊపేసింది.
వెనుక వైపు నుంచి ప్రభాస్ లుక్ ని చూచాయగా రిలీజ్ చేశారు.విడుదల తేదీ ఇంకా ఖరారు కాకపోయినా ఇంత ముందుగా ప్రమోషన్ మొదలు పెట్టడంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అనుసరిస్తున్న స్ట్రాటజీ ఇతర నిర్మాణ సంస్థలను ఆశ్చర్యానికి గురి చేసింది.
బిజినెస్ కోసం ఇప్పటికే ఆఫర్ల ఒత్తిడి విపరీతంగా ఉన్న కారణంగా గరిష్టంగా ఎవరు సిద్దపడతారనేది తేలాలంటే ముందు అంచనాలు పెంచాలి.
ది రాజా సాబ్ సినిమా సంక్రాంతికి రావడం లేదట.2025 మార్చి లేదా ఏప్రిల్ లో ఒక మంచి డేట్ సెట్ చేసుకునే పనిలో ఉన్నారట మూవీ మేకర్స్.
ఇదే బ్యానర్ నుంచి తేజ సజ్జ మిరాయ్ వస్తున్న నేపథ్యంలో దానికి కనీసం మూడు నాలుగు వారాల గ్యాప్ ఉండేలా జాగ్రత్త పడుతున్నారు.
ఇలా ప్రభాస్ ఫుల్ స్పీడ్ మీద జోష్ మీద ఉండడంతో ఆ స్పీడ్ ని చూసి ఇతర హీరోలు ఈర్ష పడుతున్నారు.
అంతేకాదు ప్రభాస్ స్పీడ్ కి ఏ హీరోలు సాటిరారు అని చెప్పాలి.
రాజమౌళి ఆర్టిస్టులను అనౌన్స్ చేసే రోజు ఎప్పుడో తెలిసిపోయిందిగా..?