Peptic Ulcer : ఈ అలవాట్లు ఉన్నవారికి తీవ్రమైన అల్సర్ వచ్చే ప్రమాదం.. జాగ్రత్త..!

ముఖ్యంగా చెప్పాలంటే కడుపు పూతలను సాధారణంగా పెప్టిక్ అల్సర్( Peptic Ulcer ) అని కూడా అంటారు.

ఇవి కడుపు లేదా చిన్న ప్రేగు యొక్క లైనింగ్ లో అభివృద్ధి చెందుతాయి.

ఇవి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు, నాన్-స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అధికంగా మద్యం సేవించడం( Drinking Alcohol ) మరియు ధూమపానం చేసే వారిలో ఎక్కువగా ఏర్పడతాయి.

అల్సర్ లు తీవ్రమైన నొప్పి మరియు అసౌకర్యాన్ని కలిగిస్తాయి.తరచుగా కడుపు యొక్క రక్షిత లైనింగ్ లో అభివృద్ధి చెందుతాయి.

అయినప్పటికీ కొన్ని రోజు వారి అలవాట్లు కడుపు పూతల అభివృద్ధి సంభావ్యతను పెంచుతాయి.

జీర్ణకోశం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏ అలవాటులను దూరం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. """/"/ ముఖ్యంగా చెప్పాలంటే భోజనం మారడం లేదా ఎక్కువసేపు తినకపోవడం వల్ల కడుపులో గ్యాస్టిక్ యాసిడ్స్( Gastric Acids ) రావడం మరియు జీర్ణ క్రియ ప్రక్రియల సున్నితమైన సమతుల్యత దెబ్బతింటుంది.

భోజనం మానేయడం వల్ల పొట్ట ఎక్కువసేపు ఖాళీగా ఉంటుంది.ఇది కడుపులో ఎక్కువ యాసిడ్స్ ను అభివృద్ధి చేస్తుంది.

ఈ పెరిగిన అమలత్వం కడుపు యొక్క రక్షిత లైనింగ్ ను దెబ్బతీసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

తర్వాత అల్సర్స్ అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది.ఆరోగ్యకరమైన జీవన శైలిని నిర్ధారించడానికి సాధారణ భోజన సమయాలకు కట్టుబడి ఉండడం ఎంతో ముఖ్యం.

"""/"/ అలాగే కారంగా ఉండే ఆహారాలు ఆహారం యొక్క రుచిని మెరుగుపరుస్తాయి.

ఇవి పొట్ట సమస్యలను తీవ్రతరం చేస్తాయి.దీని వల్ల అల్సర్ తో ఇబ్బంది పడేవారు స్పైసీ ఫుడ్స్( Spicy Foods ) తినకపోవడమే మంచిది.

అలాగే కాఫీ మరియు టీలు మన జీవితంలో విడదీయరాని పాత్ర పోషిస్తాయి.కానీ కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల పొట్టలో ఎక్కువ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది.

ఈ యాసిడ్ కడుపు యొక్క రక్షిత పొరను దెబ్బతిస్తుంది.కడుపు పుండును అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతుంది.

కెఫిన్( Caffine ) లేని పానీయాలను ఎంచుకోవడం మరియు కెఫిన్ తీసుకోవడం తగ్గించడం వల్ల ఈ ప్రమాదం నుంచి బయటపడవచ్చు.

అలాగే ధూమపానం( Smoking ) కూడా అస్సలు చేయకూడదు.అల్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి ధూమపానం మానేయడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

జానీ మాస్టర్ కేసులో ఊహించని ట్విస్ట్.. ఆ యువతిపై ఏకంగా ఇలాంటి ఆరోపణలా?