షాకింగ్: ఆమె చేయి బాగా పెరిగిపోతుందని కట్ చేసుకోమని సూచించిన నెటిజన్లు!
TeluguStop.com
దురదృష్టవశాత్తు మనలో కొంతమంది ఏదోఒక వైకల్యంతో పుడతారు.మరికొంతమందికి పుట్టిన తరువాత వైకల్యం సంభవిస్తుంది.
అయితే మరికొంతమందికి చాలా అరుదుగా వాస్కులర్ వైకల్యాలు రక్తం లేదా శోషరస నాళాలు పిండ దశలో అభివృద్ధి చెందుతాయి.
ఇవి చాలా అరుదుగా కొంతమందికే సంభవిస్తాయి.ఇలాంటివారు మొదట బాగానే వుంటారు.
కానీ రానురాను వారి శరీరంలో మార్పులు చోటుచేసుకుంటాయి.అందువల్ల వీరు నలుగురిలోకి రావడానికి సిగ్గుపడుతూ వుంటారు.
ఇలాంటి సమస్యలు శరీరంలో చర్మం, కండరాలు, ఇతర అవయవాలు వంటి ప్రాంతాలలో సంభవిస్తాయి.
ప్రస్తుతం ఈ అరుదైన వైకల్యంతో ఓ 18 ఏళ్ల యువతి బాధపడుతుంది.US వెర్మోంట్‌లోని స్ప్రింగ్‌ఫీల్డ్‌కు చెందిన ఒలివియా క్లోప్‌చిన్ అనే 18 ఏళ్ల టీనేజర్ కు 2 నెలల వయసులోనే వాస్కులర్ వైకల్యం ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు.
దాంతో ఆమె తల్లిదండ్రులు ఆమె చికిత్సకోసం ఎంతో వెచ్చించారు.అయినా సుఖం లేకుండా పోయిందని వాపోతున్నారు.
సాధారణంగా ఒక వ్యక్తి వాస్కులర్ వైకల్యంతో ఉన్నప్పుడు రక్తనాళాల అభివృద్ధి అనేది అసాధారణంగా ఉంటుంది.
"""/"/ ఇది ఏ ప్రాంతంలో అయితే ప్రభావితమైందో.అక్కడ చర్మపు రంగు మారిపోవడానికి లేదా ప్రోట్రూషన్‌లకు కారణమవుతుంది.
ఈ కారణంగా కాలక్రమేణా ఒలివియా చేయి కొద్దికొద్దిగా రక్తం గడ్డకట్టడంతో స్కిన్ కలర్ మారి పెద్దగా పెరిగింది.
ఇక అలా అందవికారంగా పెరిగిన హ్యాండ్‌తో చేసిన వీడియోలు టిక్ టాక్‌లో పోస్ట్ చేయగా.
కొంతమంది ఆమె చేయి నరికేసుకోవాలని చాలా వికృతంగా కామెంట్ చేస్తున్నారు.దానికి ఆమె ఎంతగానో మానసిక క్షోభని అనుభవిస్తుంది.
అయితే అందులో కొందరు వినియోగదారులు ఆమె సహనాన్ని, నమ్మకాన్ని ప్రశంసిస్తున్నారు.
చరణ్ పేరు వెనుక అసలు కథ ఇదే.. ఏడాదికి 100 రోజుల పాటు మాలలోనే ఉంటారా?