పోడు భూముల సర్వేతో అర్హులకే లబ్ది చేకూర్చాలి కలెక్టర్ కు ప్రజాపంథా వినతి
TeluguStop.com
జిల్లాలో పోడు భూముల సర్వే బృందాలు క్షేత్రస్థాయిలో ఎలాంటి రాజకీయ జోక్యానికి, ప్రలోభాలకు పాల్పడకుండా, వాస్తవిక అర్హులకే లబ్ధి చేకూర్చే విధంగా చేయాలని సిపిఐ ఎంఎల్ ప్రజా పంథా ఖమ్మం జిల్లా కమిటీ ప్రతినిధి బృందం సోమవారం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చినారు.
గతంలో పోడు భూములను కొట్టి, వ్యవసాయం చేసే వాళ్లకు మాత్రమే పట్టాలిస్తామని, బోగస్ వాళ్లకి ఇచ్చిన పట్టాల ఆధారాలిస్తే,వాటిని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా, సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా ఖమ్మం జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, జిల్లాలో పోడు భూముల సమస్యను పరిష్కరించి, జిల్లాస్థాయిలో అధికారులతో కమిటీ వేసి, 48 సర్వే బృందాల ద్వారా క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తామని, సాగుదారులకు న్యాయం చేస్తామని ప్రభుత్వ ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
గతంలోపోడు భూములకు హక్కులు కల్పించే విషయంలో కొన్ని అవకతవతలు జరిగాయనీ, ఫారెస్ట్ అధికారులు సహకరించకపోవడం వలన కొంతమందిఅర్హులకు పట్టాలు రాలేదని, కొంతమంది పోడు సాగు దారులు కాకపోయినప్పటికీ, వారికి అక్రమ హ క్కు పట్టాలు ఇచ్చారని ఆయన అన్నారు.
ఎల్లన్న నగర్ భూములలో రజబ్ ఆలీ నగర్ వారికి అక్రమంగా పట్టాలు ఇచ్చారని , కొంతమంది రాజకీయ పలుకుబడి కలవారికి ఇచ్చారని ఆయన అన్నారు, వారు ఎప్పుడూ పోడుభూము లతో సంబంధం కలిగి లేరని, అది వివాదంగా తయారైందని, అనేక చోట్ల కూడా ఈ విధంగానే ఉందని ఆయన అన్నారు.
మరి కొన్నిచోట్ల రాజకీయ నాయకుల జోక్యం ముఖ్యంగా, అధికార పార్టీ నాయకుల పలుకుబడితో అవకతవకలు జరుగుతున్నాయన్నారు.
మరొక ప్రక్క కొన్నిచోట్ల ఫారెస్ట్ అధికారులు అత్యుత్సాహంతో సాగు చేసుకోకుండా అడ్డు కుంటున్నారన్నారు.
సత్తుపల్లి మండలం గుడిపాడులో ఆ విధంగా అడ్డుకున్నారని ఆయన అన్నారు.పొడుభూముల విషయంలో అక్రమాలకు, అవినీతికి, అవకతవకలకు తావు లేకుండా,నిష్పక్షపాతంగా క్షేత్రస్థాయి సర్వే చేసి, అసలైన పోడు సాగుదారులకు లబ్ధి చేకూర్చే విధంగా, పట్టాలు ఇవ్వాలని ఆయన కోరినారు.
ప్రతినిధి బృందంలో పార్టీ జిల్లా నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు, కంకణాల అర్జున్ రావు, సి వైపుల్లయ్య,గుబ్బగుర్తి ఉప సర్పంచ్ సోములు లు, రాపోలు కృష్ణ, గండికోట లక్ష్మణ్, బాబు, రమేష్, వెంకన్న తదితరులు ఉన్నారు.
రాబిన్ హుడ్ టీజర్ రివ్యూ.. ఆ ఒక్క డైలాగ్ తో సినిమాపై అంచనాలు పెరిగాయిగా!