ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవారు సైక్లింగ్ చేయకూడదా..
TeluguStop.com
చాలా మంది సైక్లింగ్ చెయ్యాలంటే ఇష్టపడతారు.ఎందుకంటే సైకిల్ మీద ఎలాంటి పొల్యూషన్ లేకుండా హాయిగా వెళ్ళవచ్చు.
అలాగే సైకిల్ అన్నది మన చిన్నప్పటి నుంచి అందరికీ చాలా ఇష్టం.అందుకే సైకిల్ తొక్కడం అంటే చాలా మందికి ఇష్టం.
అలాగే సైక్లింగ్ చెయ్యడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు.అలాగే ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండేందుకు రోజూ చేసే వివిధ రకాల వ్యాయామ ప్రక్రియల్లో కీలకమైంది సైక్లింగ్.
ఇలా చెయ్యడం వల్ల శరీరం పూర్తి ఫిట్‌గా ఉండే అవకాశం ఉంది.అయితే మంచి ఆరోగ్యం కోసం సరైన ఆహారంతో పాటు వ్యాయామం కూడా చాలా అవసరం.
ఎక్సర్ సైజ్ వల్ల శరీరం మొత్తం ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంటుంది.అలాగే రోజూ క్రమం తప్పకుండా జిమ్ కు వెళ్లి వ్యాయామం చేసే సమయం లేకపోతే, దానికి బదులుగా సైక్లింగ్ అలవాటు చేసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిదే.
అంతే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా ఆరోగ్యంగా ఉండేలాగా చేస్తుంది.ప్రతిరోజూ క్రమం తప్పకుండా సైక్లింగ్ చేయడం వల్ల గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది.
దాంతో పాటు అధిక రక్తపోటు కూడా కంట్రోల్ లో ఉంటుంది.సైక్లింగ్ వల్ల ఒత్తిడి తగ్గి మానసిక ఆరోగ్యం కూడా బలంగా ఉంటుంది.
"""/" /ఇలా ప్రతిరోజు సైకిల్ చేయడం వల్ల సైక్లింగ్ జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది.
కానీ కొంతమందికి మాత్రం సైక్లింగ్ చేయడం వల్ల లేనిపోని అనారోగ్యాలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కీళ్ల నొప్పులు,జాయింట్ పెయిన్స్ ఉన్నవారు ఎట్టి పరిస్థితులలోనూ సైక్లింగ్ చేయడం అంత మంచిది కాదు.
ఇలాంటి సమస్యలు ఉన్నవారు సైకిల్ పై ప్రయాణించడం వల్ల ఆ సమస్య ఇంకా అధికమయ్యే అవకాశం ఉంది.
ఇంకా చెప్పాలంటే ముఖ్యంగా ఆస్తమా, బ్రాంకైటిస్ సమస్యలతో బాధపడేవారు సైకిల్ తొక్కడం అంత మంచిది కాదు.
సైక్లింగ్ చేసే సమయంలో ఆస్తమా సమస్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాలో అనిమల్ హీరో నటిస్తున్నాడా..?