ప్రజలే బుద్ధి చెబుతారు…కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వ్యాఖ్యలు..!!
TeluguStop.com
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికలలో కూడా గెలిచే విధంగా సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఈ క్రమంలో ఫిబ్రవరి 2వ తారీఖు నుండి ఎన్నికల ప్రచారానికి కూడా రెడీ అవుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహించి ఎన్నికల ప్రచారం చేయడానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.
నిన్న గాంధీ భవన్( Gandhi Bhavan ) లో జరిగిన సమావేశంలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో మెజార్టీ స్థానాలు దక్కించుకొని మంచి ఫలితాలు రాబట్టాలని నేతలకు రేవంత్ తెలియజేయడం జరిగింది.
"""/" /
విపక్షాలకు ఎక్కడ అవకాశం లేకుండా కార్యకర్తలందరూ బాగా కష్టపడాలని సూచించారు.
అదేవిధంగా ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల విషయం అధిష్టానం చూసుకుంటుందని అన్నారు.కాగా నేడు తాజాగా బీజేపీ.
బీఆర్ఎస్ ( BJP.BRS )పార్టీలపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో లిక్కర్ పార్టీ నిక్కర్ పార్టీ కలిసి పనిచేస్తున్నాయని సెటైర్లు వేశారు.
అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు లిక్కర్ పార్టీని ఓడించారు.ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో నిక్కర్ పార్టీని ఓడించాలని పేర్కొన్నారు.
ఇదే సమయంలో ఆరు నెలలలో కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని కొంతమంది అంటున్నారు.
అటువంటి ప్రయత్నం చేస్తే ప్రజలే ఆయనకు గట్టిగా బుద్ధి చెబుతారు అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించడం జరిగింది.
యూపీఐ ఎక్కువగా వాడుతుంటే ఇలా చేయండి.. లేకపోతే మీ ఎకౌంట్ ఖాళీ అవ్వడం ఖాయం