ఎండ‌ల దెబ్బ‌కు రోజంతా ఏసీలో ఉంటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌!

నేటి కాలంలో ఏసీ( AC )(ఎయిర్ కండీషనర్)ల వినియోగం ఎంత‌లా పెరిగిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

దాదాపు ప్ర‌తి ఒక్క ఇంటికి ఏసీ ఉంటోంది.ఆఫీసుల్లో ఏసీ తప్పనిసరి అయింది.

షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ థియేటర్లు, హాస్పిటల్స్, హోటళ్లు.ఇవ‌న్నీ ఏసీ లేనిదే ఊహించ‌డం కూడా క‌ష్ట‌మే.

ఇంతకుముందు కేవలం విలాస వస్తువులుగా భావించిన ఏసీలను ప్ర‌స్తుత రోజుల్లో మధ్యతరగతి ప్రజలు కూడా కొనుగోలు చేస్తున్నారు.

మిగిలిన సీజ‌న్ల‌తో పోలిస్తే స‌మ్మ‌ర్ సీజ‌న్ లో ఏసీలను తెగ ఆడిస్తుంటారు.ఎండ‌ల దెబ్బ‌కు భ‌య‌ప‌డి ఏసీలోనే గ‌డుపుతుంటారు.

అయితే రోజంతా ఏసీలో ఉండేవారు క‌చ్చితంగా ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.ఏసీ గదిలో ఎక్కువసేపు ఉండటం వల్ల ఆక్సిజన్ స్థాయి తగ్గుతుంది, దీని వల్ల తలనొప్పి, అల‌స‌ట( Headache, Exhaustion ) వంటి స‌మ‌స్య‌లు త‌లెత్త‌వ‌చ్చు.

ఎక్కువసేపు ఏసీలో ఉంటే ముక్కు పొడిబారటం, గొంతు ఆరిపోవ‌డం, తుమ్ములు రావడం లాంటి సమస్యలు రావచ్చు.

డస్ట్ ఫిల్టర్ సరిగ్గా శుభ్రం చేయకపోతే దుమ్ము, బాక్టీరియా పెరిగి అలర్జీ, అస్తమా, శ్వాస సంబంధిత స‌మ‌స్య‌లు ఇబ్బంది పెట్ట‌వ‌చ్చు.

"""/" / ఏసీ గాలి వ‌ల్ల శ‌రీరంలో తేమ తగ్గిపోతుంది.దీని వల్ల డిహైడ్రేషన్, చర్మం పొడిబారటం, పెదవులు పగలడం, చుండ్రు సమస్యలు త‌లెత్త‌వ‌చ్చు.

రోజంతా ఏసీలోనే కూర్చుంటే శరీర ఉష్ణోగ్రత తగ్గిపోతుంది, ఇది కండరాలు గడ్డకట్టేందుకు దారి తీస్తుంది.

ఈ పరిస్థితి వృద్ధులకు మరియు అర్థరైటిస్( Arthritis ) ఉన్నవారికి సమస్యగా మారవచ్చు.

ఏసీ గదిలో ఎక్కువసేపు ఉండి ఒక్కసారిగా బయటకి వెళ్తే, వేడి-చలి మార్పు వల్ల తేలిగ్గా జలుబు, ఫ్లూ, వైరల్ ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉంటుంది.

"""/" / అంతేకాదు, రోజంతా ఏసీలోనే ఉంటే నిద్ర సమస్యలు, ఒత్తిడి, మానసిక ఆందోళన కలగవచ్చు.

కాబ‌ట్టి ఏసీలో ఉండేవారు త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.ఏసీని చాలా తక్కువ ఉష్ణోగ్రతలో కాకుండా 22-26°C మధ్య ఉంచుకోవడం మంచిది.

ఏసీ గదిలో తేమను నిలుపుకోవడానికి హ్యూమిడిఫైయర్ లేదా వాటర్ బౌల్ పెట్టుకోవాలి.ఏసీ గాలి నేరుగా మీ మీద పడకుండా జాగ్రత్త పడాలి.

చెమటతో ఉన్నప్పుడు ఏసీ గదిలోకి వెళ్ళకూడదు.ఏసీలో ఎక్కువసేపు కూర్చొంటే రక్తప్రసరణ మందగించే అవకాశం ఉంటుంది, అందుకే కొన్ని గంటలకు ఒక్కసారైనా బయట స్వచ్ఛమైన గాలి పీల్చాలి.

ద్రవ పదార్థాలను ఎక్కువ‌గా తీసుకోవాలి.