ఐదేళ్లుగా నరకం చూస్తున్న ప్రజలు – పట్టంచుకొని అధికార యంత్రాంగం

నల్లగొండ జిల్లా: గుర్రంపోడ్ మండలంలోని కొప్పోలు నుండి నడికూడ, పిట్టలగూడం నుండి తేనేపల్లి వెళ్లే రహదారులు పూర్తిగా ధ్వంసమై,కంకర తేలి,పెద్ద పెద్ద గుంతలు పడి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక వర్షం పడితే చాలు గుంతల్లో నీళ్ళు నిలిచి చిత్తడిగా మారి ప్రమాదాలకు కేరాఫ్ గా మారుతున్నాయని వాపోతున్నారు.

ఇవి మాత్రమే కాదు ఈ మండలంలోని దాదాపు గ్రామీణ ప్రాంత రోడ్లన్నీ అస్తవ్యస్థంగానే మారాయని,చినుకు పడితే అడుగు బయట పెట్టే పరిస్థితి లేదని, ఐదేళ్ల నుండి రోడ్లపై కనీస మరమ్మతులు చేపట్టక పోవడంతో ఈ పరిస్థితి నెలకొందని,అయినా అధికారులకు,ప్రజా ప్రతినిధులకు ప్రజలు బాధలు పట్టకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

అభివృద్ది చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వ పెద్దలకు మా కష్టాలు కనిపించడం లేదా? లేక ప్రభుత్వ చేతకాని తనానికి నిదర్శనమా? అని ఆయా గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తక్షణమే దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

బ్రిటిష్ వ్లాగర్లకు ఎక్కువ ఛార్జ్ చేద్దామనుకున్నాడు.. ఈ పెద్దాయన రంగంలోకి దిగడంతో…??