మూడు రోజులుగా మీ సేవలు బంద్ ఇబ్బంది పడుతున్న జనం

మూడు రోజులుగా మీ సేవలు బంద్ ఇబ్బంది పడుతున్న జనం

నల్లగొండ జిల్లా:గత రెండు మూడు రోజులుగా నల్లగొండ జిల్లాలోని 177 మీ సేవ కేంద్రాల్లో సేవలు నిలిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

మూడు రోజులుగా మీ సేవలు బంద్ ఇబ్బంది పడుతున్న జనం

సర్వర్ బిజీ కారణంగా సేవలు అందించలేకపోతున్నామని,ప్రజలు వివిధ రకాల సమస్యలతో మీ సేవ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారని వాపోతున్నారు.

మూడు రోజులుగా మీ సేవలు బంద్ ఇబ్బంది పడుతున్న జనం

మీసేవ కేంద్రాల్లో రెవెన్యూ, మున్సిపల్,పోలీస్, రిజిస్ట్రేషన్లు,రవాణా తదితర 36 శాఖలకు సంబంధించిన సర్టిఫికెట్స్ జారీ చేయాల్సి ఉంటుంది.

అలాగే విద్యార్థులకు ఉపయోగపడే వివిధ రకాల ధృవపత్రాలు, జనన,మరణ,ఆదాయ, కుల,నివాస ధృవపత్రాలు కూడా మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకుంటేనే పొందే వెసులుబాటు ఉండడంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నల్లగొండ జిల్లాలో రోజుకు కొన్ని వందల దరఖాస్తులు వస్తుంటాయి.వచ్చేది రెండో శనివారం ఆదివారం కావడంతో రెండు రోజులు సెలవు ఉంటుందని, సోమవారం కూడా వినాయక నిమజ్జనం సెలవు ఉండే అవకాశం ఉంటుందని సమాచారం.

ఈ నేపథ్యంలో ప్రజలు మరింత ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రజల తిప్పలను దృష్టిలో ఉంచుకుని ఈ సమస్య త్వరగా పరిష్కరించాలని మీసేవ యజమాన్యం, ప్రజలు కోరుతున్నారు.