అప్పుడు ఈ దేశంలో మనుషుల్ని పీక్కుతిన్నారు!

రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొద‌లై రెండున్నర నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పరిస్థితి చ‌క్క‌బ‌డ‌లేదు.

ఇప్పుడు మనం యుద్ధాన్ని ఎదుర్కొంటున్న ఉక్రెయిన్‌కు సంబంధించిన మ‌రి కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను తెలుసుకుందాం.

ఉక్రెయిన్ రాజధాని కైవ్, ఇది ఆ దేశంలోని అతిపెద్ద నగరం.కైవ్‌ను అందమైన మహిళల నగరంగా కూడా పిలుస్తారు.

ఉక్రెయిన్‌లో ఇటువంటి అనేక విశేషాలు ఉన్నాయి.వాటి గురించి చాలామందికి తెలియ‌దు.

ప్రపంచంలోనే అత్యంత ఆక‌ర్ష‌ణీయ‌మైన‌ రైల్వే స్టేషన్.ఆర్సెనల్నా మెట్రో స్టేషన్ ఉక్రెయిన్‌లో ఉందని తెలిస్తే ఆశ్చర్యం క‌లుగుతుంది.

ఈ స్టేషన్ భూమి నుండి 346 అడుగుల లోతులో నిర్మిత‌మ‌య్యింది.ప్రపంచ దేశాలలో మద్యపానం తప్పుగా పరిగణించబడుతున్నప్పటికీ, ఇక్కడి ప్రజల సంప్రదాయంలో ఇది ఒక భాగం.

ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం మద్యం వినియోగంలో ఉక్రెయిన్ ప్రపంచంలో ఆరవ స్థానంలో ఉంది.

మనం గణాంకాలను పరిశీలిస్తే,ఇక్కడ తలసరి ఆల్కహాల్ ప్రతి సంవత్సరం సుమారు 14 లీటర్ల చొప్పున వినియోగిత‌మ‌వుతుంది.

ప్రపంచంలోని ఇతర దేశాలలో వివాహ సమయంలో వివాహ ఉంగరాన్ని ఎడమ చేతికి ధరిస్తారు.

ఉక్రెయిన్‌లో కుడి చేతికి వివాహ ఉంగరాన్ని ధరించే సంప్రదాయం ఉంది. """/" / ఉక్రెయిన్ ప్రజలు సంగీతాన్ని ఎంత‌గానో ఇష్టపడతారు.

ప్రపంచంలోనే అతి పొడవైన సంగీత వాయిద్యం ఈ దేశంలోనే తయారవడానికి కారణం ఇదే.

ఇది చెక్కతో చేసిన కొమ్ములాగా ఉంటుంది.దీనిని 'ట్రెంబిటా' అని పిలుస్తారు.

1932-33 సంవత్సరంలో ఉక్రెయిన్‌లో తీవ్ర కరువు ఏర్పడింది.దీంతో లక్షలాది మంది ఆకలితో అలమటించారు.

కరువు సమయంలో ఆకలిని త‌ట్టుకోలేక మ‌నుషులు తోటి మ‌నుషుల‌ను పీక్కుతిన్నారు.ఈ నేప‌ధ్యంలో న‌ర‌మాంస‌ భక్షక ఆరోపణలపై సుమారు 2,500 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

ఈ ఇంటి చిట్కాలు ఉండగా నల్లటి వలయాలతో దిగులెందుకు దండగ!