బిజెపి అభ్యర్థి ఆరేపల్లి మోహన్ వెంట నడుస్తున్న జనం… ఇల్లంతకుంటలో విస్తృత ప్రచారం..

అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ తప్పుడు సర్వేలు, గాలి వార్తలను , పుకార్లను సృష్టిస్తుంది.

బీసీ ముఖ్యమంత్రి, ఎస్సీ వర్గీకరణ, మేనిఫెస్టో అంశాలతో ప్రజలంతా బిజెపి వైపే.

మానకొండూరు గడ్డపై కాషాయ జెండా ఎగురవేస్తాం.బి ఆర్ ఎస్, కాంగ్రెస్ కు వలస పోతున్న నాయకుల ది రాజకీయ స్వార్థం.

స్వలాభమే.పదవుల్లో ఉండి కూడా ప్రజలకు ఏలాంటి లాభం చేయనోళ్లు .

నేడు పార్టీలు మారి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు! వారి మాటలు నమ్మి మోసపోకండిబిజెపి అసెంబ్లీ అభ్యర్థి, మాజీ శాసనసభ్యులు ఆరెపల్లి మోహన్.

రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూరు బిజెపి అసెంబ్లీ అభ్యర్థి ఆరేపల్లి మోహన్( Arepalli Mohan ) ప్రచారానికి ప్రజానీకం బ్రహ్మరథం పడుతున్నారు.

అడుగడుగునా గ్రామ గ్రామాన ఆరేపల్లి మోహన్ కి అపూర్వస్వాగతంపలుకుతున్నారు.స్వచ్ఛందంగా ప్రజానికం తరలివచ్చి ఆయనవెంటనడుస్తున్నారు.

ఇల్లంతకుంట మండలంలోని తాళ్లపల్లి, వంతడుపుల, రహీంఖాన్ పేట్, వెల్జిపూర్ గ్రామాల్లో శుక్రవారం రోజున ఆరేపల్లి మోహన్ విస్తృత ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆరేపల్లి మోహన్ మాట్లాడుతూ మానకొండూరు నియోజకవర్గం లో కాంగ్రెస్ గాలి వీస్తుందని , తప్పుడు సర్వేలు , వార్తలు పుకార్లను సృష్టిస్తుందని వాటిని నమ్మవద్దని, విశ్వసించవద్దన్నారు.

తప్పుడు సర్వేలు , వార్తలను విస్తృతం చేసి ప్రజలను తప్పుదారి పట్టించాలనుకోవడం మూర్ఖత్వమన్నారు.

బీసీ ముఖ్యమంత్రి, ఎస్సీ వర్గీకరణ ప్రకటన, మేనిఫెస్టోలోని అంశాలతో ప్రజలంతా బిజెపి వైపు చూస్తున్నారనన్నారు.

నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజల మద్దతుతో మానకొండూర్ గడ్డపై కాషాయం జెండా ఎగరవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్, బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ కు వలస పోయి , పార్టీ మారే నాయకులది అవకాశవాద రాజకీయాలన్నారు.

ప్రజలకు సేవ చేయడం కంటే అధికారమే పరిభావదిగా జీవించి ఊసరవెల్లిలా పార్టీలు మారే నాయకుల మాటలను నమ్మి మోసపోవద్దన్నారు.

నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో ఇన్నేళ్లుగా అధికార పార్టీలో పనిచేసి , పదవులు అనుభవించి నేడు ఇతర పార్టీలోకి పోతున్న నాయకులు ,కార్యకర్తలు ఏ లక్ష్యంతో పోతున్నారని ఆయన ప్రశ్నించారు.

పార్టీ మారే నాయకులే గందరగోళాన్ని సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, వారి మాటల్ని విశ్వసించవద్దన్నారు.

బిజెపి ప్రజల మనసుల్లో ఉందని , జరగబోయే ఎన్నికల్లో బిజెపి మోడీ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారని చెప్పారు.

మానకొండూరు నియోజకవర్గం( Manakondur Assembly Constituency )లో మోడీ బిజెపి పార్టీ ( BJP )అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించి , భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ప్రచార కార్యక్రమంలో ఇల్లంతకుంట మండల అధ్యక్షులు సంతోష్,జిల్లా అధికార ప్రతినిధి కొత్త శ్రీనివాస్,అసెంబ్లీ కో కన్వీనర్ బత్తిని స్వామి,జిల్లా కార్యవర్గ సభ్యులు కొలనూర్ ముత్తాక్క,మండల నాయకులు భూమల్ల అనిల్,కట్నపెల్లి రవీందర్,వజ్జెపల్లి శ్రీకాంత్, తిప్పారాపు శ్రవణ్,మ్యాకల మల్లేశం,ఇట్టిరెడ్డి లక్ష్మ రెడ్డి, పిట్టల అశ్విని,బత్తిని సాయ గౌడ్,దేశెట్టి శ్రీనివాస్, చిట్యాల శ్రీనివాస్, ఓరేం బార్గవ్ రెడ్డి, పల్లె సాయి,చిమ్మన గొట్టు శ్రీను లు ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఉదయం అలారం పెట్టుకుని నిద్ర లేస్తున్నారా.. అయితే జర జాగ్రత్త!