వ్యాధుల సమస్యతో బాధపడుతున్న వారు ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవాలా..
TeluguStop.com
చాలామంది ప్రజలు ఆరోగ్యమే మహాభాగ్యం అని జీవిస్తూ ఉంటారు.ఎంత డబ్బు, హోదా, పరపతి ఉన్న చక్కని ఆరోగ్యం లేకపోతే అవన్నీ వ్యర్థమే.
అయితే మరీనా జీవన శైలి, రసాయన ఎరువుల వాడకం కారణంగా జబ్బులు, వ్యాధులు లాంటి ఎన్నో సమస్యలు పెరిగిపోతున్నాయి.
డబ్బులు లేని వాళ్ళు కనిపిస్తారేమో కానీ జబ్బు లేని వారు మాత్రం అస్సలు కనిపించరు.
వ్యాధులు ఏ వైద్యుల హస్తవాసితో తగ్గుతుంది అనేది కచ్చితంగా చెప్పలేము.ఇక కొన్ని డబ్బులు ఎంత మంది వైద్యుల వద్దకు వెళ్లిన వ్యాధులు దూరం కావు.
"""/"/
అలాంటివి ఈ పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటే ప్రగాఢమైన విశ్వాసంతో సంపూర్ణమైన భక్తిశ్రద్ధలతో స్వామివారిని పూజిస్తే తగ్గిపోతాయి.
ఇలాంటి సంఘటనలు మనం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం.కాశి క్షేత్రానికి వెళ్లాలనుకునే ఆలోచన చేయగానే సమస్త పాపాలు నశిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి.
అత్యంత పవిత్రమైన ఈ పుణ్యక్షేత్రం అనేక విశేషాల సమూహారంగా కనిపిస్తూ ఉంటుంది.ఇక్కడ సూర్య భగవానుడు కొలువైన 12 దేవాలయాలు ఉన్నాయి.
ఒక్కో దేవాలయంలో సూర్య భగవానుడు ఒక్కో పేరుతో పిలవబడుతూ, పూజాభిషేకలను అందుకుంటూ ఉన్నాడు.
అలాంటి వాటిలో విమాలధితే కొలువైన ఆలయం కూడా ఒకటి. """/"/
పూర్వం విమాలుడు అనే రాజు కుష్టు వ్యాధితో బాధపడుతూ ఉండేవాడు.
దానివల్ల జీవితం పట్ల విరక్తితో ఆయన భార్య, బిడ్డలను వదిలి కాశి క్షేత్రానికి వెళ్ళాడు.
సూర్యుడి రూపాన్ని ప్రతిష్టించి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించాడు.ఆయన తపస్సుకు మెచ్చిన సూర్య భగవానుడు ప్రత్యక్షమై కుష్టి వ్యాధి నుంచి ఆయనకు విముక్తిని కల్పించాడు.
ప్రతిష్టించిన మూర్తి విమాలాధిత్రుడు పేరుతో పూజ అందుకుంటున్న అని సెలవిచ్చాడు.విమాలధిత్రుడు పూజించిన వారికి వ్యాధులు, బాధలు, దరిద్రం దుఖాలు ఉండవని వెల్లడించాడు.
అందువల్ల కాశి క్షేత్రానికి వెళ్లినవారు ఇక్కడి సూర్యదేవాలయాలను తప్పనిసరిగా దర్శించుకోవడం వల్ల ఇలాంటి వ్యాధులను దూరం చేసుకోవచ్చు.
నాగబాబు కు కాదు.. మళ్లీ వారికే రాజ్యసభ ఛాన్స్ ?