చక్కెర వ్యాధితో బాధపడేవారు రోజువారి డైట్ లో.. ఈ నియమాలను పాటించాల్సిందే..

ప్రస్తుత సమాజంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిలో చక్కెర వ్యాధి కనిపిస్తుంది.

కారణాలు ఏవైనా చక్కెర వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది.

ఒక్కసారి చెక్కెర వ్యాధి బారిన పడితే జీవితాంతం మందులు ఉపయోగిస్తూనే ఉండాలి.లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.

ముఖ్యంగా ఈ వ్యాధిని అదుపులో ఉంచుకోవాలంటే మనం రోజు వారి ఆహారపు అలవాట్లను తప్పనిసరిగా మార్చుకోవాలి.

"""/"/అయితే చాలా మందికి రోజు వారి డైట్ లో ఎటువంటి ఆహారం తీసుకోవాలి.

ఎటువంటి ఆహారం తీసుకోకూడదో కొన్ని సందేహాలు ఉంటాయి.ముఖ్యంగా చెప్పాలంటే చక్కెర వ్యాధితో బాధపడే వారు రోజువారి డైట్ లో తీసుకోకూడని ఆహార పదార్థాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

కొలెస్ట్రాల్ అధికంగా ఉండే పిజ్జా, బర్గర్, ఫ్రైడ్ రైస్ లాంటి ఫాస్ట్ ఫుడ్ ను అధికంగా తీసుకోవడం వల్ల ఊబకాయ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

దీని వల్ల చక్కెర వ్యాధి కూడా వస్తుంది.అలాగే చక్కెర వ్యాధిగ్రస్తులు అత్యధిక కార్బోహైడ్రేట్స్ ఉన్న వైట్ రైస్, బంగాళాదుంప, అరటి పండు, ఎండు ద్రాక్ష వంటివి తినకపోవడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.

అంతేకాకుండా చక్కెర వ్యాధి నుంచి భవిష్యత్తులో రక్షణ పొందాలంటే రోజువారి ఆహారంలో అత్యధిక కార్బోహైడ్రేట్స్, క్యాలరీలు """/"/కలిగిన వైట్ రైస్ ను ఆహారంగా తీసుకోవడానికి బదులుగా పీచు పదార్థాలు పుష్కలంగా ఉండే కొర్రలు, రాగులు, జొన్నలు వంటి చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవడం మంచిది.

ఇంకా చెప్పాలంటే అత్యధిక పీచు పదార్థం ఉన్న ఆపిల్, బెర్రీ, డ్రై ఫ్రూట్స్, నారింజ వంటి పండ్లు ఎక్కువగా తీసుకుంటే వీటిలో పుష్కలంగా ఉన్న పీచు పదార్థం రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించి చక్కెర వ్యాధినీ అదుపులో ఉంచుతుంది.

జగన్ మద్దతు ఇవ్వకపోతే… బీజేపీ టార్గెట్ వారే ?