సెల్ఫీలు తీసుకుంటున్న యువకులకు షాకిచ్చిన ఏనుగులు.. వీడియో వైరల్!

స్మార్ట్‌ఫోన్లు వాడకంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఫోటోగ్రాఫర్ అయ్యారు.మంచి ఫొటోలు తీయాలనే ఉద్దేశంతో కొందరు ప్రమాదకర ప్రదేశాలకు వెళ్తున్నారు.

కొందరు సెల్ఫీల పిచ్చితో ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు.బ్రిడ్జిపైన సెల్ఫీలు దిగడం, వెళ్తున్న వాహనానికి వేలాడుతూ సెల్ఫీలు తీసుకోవడం, ఇంకా క్రూర జంతువులతో సెల్ఫీలు దిగడం వంటివి ఇప్పుడు అందరికీ అలవాటుగా మారిపోయింది.

ఇలా కొందరు చిన్న సెల్ఫీ కోసం ప్రమాదాల్లో పడిపోయి తమ జీవితాన్నే పోగొట్టుకుంటున్నారు.

ఇటీవల కూడా కొంతమంది యువకులు సెల్ఫీలు దిగాలని ఏనుగులతో పరాచకాలు ఆడారు.అదృష్టం కొద్దీ ఆ ఏనుగులు వీరిపై జాలి చూపించాయి.

లేదంటే పరిస్థితి వేరేలా ఉండేది.ఐఏఎస్ అధికారి సుప్రియ సాహు ఈ వీడియోని ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ.

"అడవి జంతువులతో సెల్ఫీ మోజు చాలా ప్రాణాంతకం.ఈ వ్యక్తులు అదృష్టవంతులు.

ఎందుకంటే ఏనుగులు వారిని చేష్టలను భరించాయి.వీరికి తగిన గుణపాఠం నేర్పించడానికి ఏనుగులకి పెద్ద కష్టమేం కాదు" అని పేర్కొన్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో కొందరు వ్యక్తులు రోడ్డు మీదకి వచ్చిన ఒక ఏనుగులు గుంపుతో సెల్ఫీలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు చూడవచ్చు.

"""/" / అనంతరం వాటికి దగ్గరగా వెళుతూ సెల్ఫీ లకు ఫోజులు ఇచ్చారు.

ఒకానొక సమయంలో ఆ ఏనుగులు వీరిని తమ కాళ్ల కింద వేసి పచ్చడి పచ్చడి చేయాలనుకున్నాయి.

దాంతో వారంతా కూడా ఒక్కసారిగా షాకయ్యారు.కానీ ఆ ఏనుగులు ఎందుకో శాంతించి మళ్ళీ తమ దారిన అవి వెళ్లిపోయాయి.

లేనిపక్షంలో వీరందరూ కూడా నుజ్జునుజ్జు అయిపోయేవారు.ఈ వీడియో చూసి నెటిజన్లు ఆ యువకులను తిట్టిపోస్తున్నారు.

ఇలాంటి వారే అనవసరంగా కన్నవారికి కడుపుకోత మిగుల్చుతున్నారని మండిపడుతున్నారు.ఈ వీడియో ని మీరు కూడా ఒకసారి చూసేయండి.

తల్లికి గౌరవం ఇవ్వని అవివేకి బండి సంజయ్..: మంత్రి పొన్నం