సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

సైబర్ నేరాలకు గురైతే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్లు 1930 లేదా డయల్ 100 లకు కాల్ చేయండి.

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla): సైబర్ మోసాల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,అప్రమత్తతతోనే సైబర్ మోసాలకు చెక్ పెట్టవచ్చు అని జిల్లా ఎస్పీ తెలిపారు.

జిల్లా పరిధిలో గడిచిన ఆరు నెలల్లో 22 పిర్యాదులో బాధితులు 17,82,433/- రూపాయలు కోల్పోవడం జరిగినదని ఈ యొక్క పిర్యాదులో వెంటనే స్పందించి టోల్ ఫ్రీ నెంబర్లు 1930, డయల్ 100 లకు కాల్ చేసిన పిర్యాదులో 8,32,360/- రూపాయలు ఫ్రిజ్ చేయడం జరిగిందని,అంతే కాకుండా వీర్నపల్లి ,కొనరావుపేట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదు అయిన సైబర్ కేసులను ఛేదించి వారు కోల్పోయిన అమౌంట్ ను కోర్టు ద్వారా వారికి అందజేయడం జరిగిందన్నారు.

జిల్లా ప్రజలు సైబర్ నేరాల పట్ల( Cyber Crimes ) అప్రమత్తంగా ఉంటూ నేరాలు జరుగు విదానం పట్ల అవగాహన ఉంటే చాలావరకు నేరాలను తగ్గించవచ్చు అని జిల్లా ఎస్పి తెలిపారు.

ఒక వ్యక్తికి ఏదైనా ఆశ చూపించి తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు వస్తాయని అతని నుండి వ్యక్తిగత సమాచారం తీసుకుని సైబర్ నేరం చేయడం జరుగుతుంది.

భయం ఏదైనా వ్యక్తికి సంబంధించిన బ్యాంకు అకౌంట్ కానీ, పాన్ కార్డు కానీ, ఇతర అకౌంట్లు బ్లాక్ అవుతుందని భయపెట్టి వారి నుంచి వ్యక్తిగత సమాచారం తీసుకొని సైబర్ నేరం చేస్తున్నారు కావున ఏదైనా సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే 1930, డయల్ 100 కి కాల్ చేస్తే మీరు పోగొట్టుకున్న డబ్బులను చాలా వరకు తిరిగి పొందేలా చేయవచ్చు అని తెలిపారు.

H3 Class=subheader-styleజిల్లా పరిధిలో గతవారం రోజులలో నమోదు సైబర్ కేసుల వివరాలు:/h3p బోయిన్పల్లి పోలీస్ స్టేషన్( Bowenpally Police Station) పరిధిలో బాధితునికి గుర్తు తెలియని నెంబర్ నుంచి కాల్ వచ్చింది.

ఆన్లైన్ మోసగాడు తాను దని పర్సనల్ లోన్ ఎగ్జిక్యూటివ్ నుంచి కాల్ చేస్తున్నానని మీకు రెండు లక్షల లోన్ శాంక్షన్ అయిందని నమ్మించాడు.

తద్వారా బాధితుల నుంచి లోన్ అప్రూవల్ అండ్ ప్రాసెసింగ్ ఫీజు కోసం పలు దఫాలుగా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు.

తద్వారా బాధితుడు 25,800/- నష్టపోయాడు.ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితునికి గుర్తు తెలియని నెంబర్ నుంచి బజాజ్ పర్సనల్ లోన్ ఎగ్జిక్యూటివ్ అని కాల్ వచ్చింది.

మీకు ఐదు లక్షల లోన్ సాంక్షన్ అయింది అని నమ్మించాడు.తర్వాత లోన్ అప్రూవల్ ప్రాసెసింగ్ కి ఇన్సూరెన్స్ ఈఎమ్ఐ అని పలుదపాలుగా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు.

ఇంకా అమౌంట్ డిమాండ్ చేయడంతో బాధితునికి అనుమానం వచ్చింది.తద్వారా బాధితుడు 34,400/- నష్టపోయాడు.

ఎల్లారెడ్డిపేట( Yellareddipeta ) పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితునికి ఇంస్టాగ్రామ్ లో ఆన్లైన్ మోసగాడు పరిచయం అయ్యి కొద్దిరోజులు చాట్ చేశాడు.

సస్పెక్ట్ యూకే లో ఉంటున్నాను అని నేను ఇండియాకి ఆగస్టులో వస్తాను అనిమీకోసం ఒక పార్సెల్ పంపిస్తున్న అందులో 35 వేల పౌండ్స్ అమౌంట్, జ్యువెలరీ ఉంది అని చెప్పాడు.

పార్సల్ ఢిల్లీ ఎయిర్పోర్టులో ఆగిపోయి0దని, మీకు పార్సల్ రావాలంటే టాక్స్, జీఎస్టీ, అమౌంట్ పే చేయాలి అని నమ్మించాడు.

తద్వారా బాధితుడు 5,09,000/- నష్టపోయాడు.●సిరిసిల్ల పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడు హోటల్ బుక్ చేసుకోవడానికి గూగుల్ లో సెర్చ్ చేశాడు.

హోటల్ కోసం 1500 పే చేశాడు.బాధితునికి అన్నోన్ వెబ్సైట్ నుంచి ఫోన్ వచ్చింది.

బాధితునికి మాయ మాటలు చెప్పిమరింత అమౌంట్ పే చేయాలని రిఫండ్ అవుతాయని నమ్మించారు.

తద్వారా బాధితుడు 76,000/- నష్టపోయాడు.h3 Class=subheader-styleతీసుకోవలసిన జాగ్రత్తలు:-/h3p మీకు లాటరి,లోన్ వచ్చిందని, కాల్ గాని మెసేజ్ గాని వచ్చిందా ?.

ఆశపడకండి, అనుమానించండి.వెంటనే 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చెయ్యండి.

అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే వీడియో కాల్స్ లిఫ్ట్ చెయ్యకండి, చేస్తే వాళ్ళు నగ్నంగా ఉండి, మీకు చేసిన వీడియో కాల్ రికార్డు చేసి,మిమ్మల్ని బెదిరించి డబ్బులు లాగేస్తారు.

వేలల్లో పెట్టుబడి లక్షల్లో లాభాలు అంటూ వచ్చే వాట్సాప్, టెలిగ్రామ్ ప్రకటనలను నమ్మకండి.

తక్కువ డబ్బులు పెట్టినప్పుడు లాభాలు ఇచ్చి ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టినప్పుడు డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తారు.

ఇలాంటి సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 కి కాల్ చెయ్యండి.మీకు ఉద్యోగం ఇస్తాం అంటూ మెసేజెస్ చేసి, మిమ్మల్ని డబ్బులు కట్టమంటున్నారు అంటే వాళ్ళు సైబర్ మోసగాళ్ళు అని గ్రహించండి.

"ఇంస్టాగ్రామ్( Instagram )" లో మీకు తెలిసిన వ్యక్తి ఫోటో వుండి మిమ్మల్ని డబ్బులు పంపమని అడుగుతున్నాడా? మరి ఆ మెసేజి మీకు తెలిసిన వ్యక్తే పంపాడా? తెలుసుకోండి, మోసపోకండి.

సోషల్ మీడియా లో ప్రకటనలు చూసి పెట్టుబడి పెట్టకండి, కొంచెం ఆగి ఆలోచించండి, అది సైబర్ మోసం కూడా కావచ్చు.

మీ ప్రమేయం లేకుండా మీకు ఓటీపీ వస్తే దాన్ని ఎవరికీ చెప్పకండి.అది సైబర్ నేరగాళ్ల ఎత్తుగడ అయివుండవచ్చు.

పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబోలో సినిమా సెట్ చేయబోతున్న స్టార్ ప్రొడ్యూసర్…