వడదెబ్బతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: డాక్టర్ లక్ష్మీప్రసన్న

వడదెబ్బ( Sun Stroke ) పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ లక్ష్మీప్రసన్న(Lakshmiprasanna ) అన్నారు.

సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని త్రిపురవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం వడదెబ్బపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రత( Heavy Temperature ), వేడిగాలుల కారణంగా వడదెబ్బతో సన్ స్ట్రోక్, డీహైడ్రేషన్ వచ్చే అవకాశం ఉందన్నారు.

వేసవికాలంలో నీరు,పళ్ళరసాలు, కొబ్బరినీళ్లు,మజ్జిగ,ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని,లేత వర్ణం తేలికైన కాటన్ దుస్తులు ధరించాలని,రోజు కనీసం 15 గ్లాసుల నీళ్లు తాగాలని,ఇంట్లో కిటికీలు తెరిచి ఉంచాలని ఫ్యాన్ వేసి చల్లగా ఉంచుకోవాలని సూచించారు.

రోడ్లమీద చల్లని రంగు పానీయాలు త్రాగరాదని, రోడ్లమీద అమ్మే కలుషిత ఆహారం తినరాదని, మాంసాహారం తగ్గించాలని, మద్యం సేవించరాదని, ఎల్లవేళల శరీరంపై భారంపడే శ్రమగల పనులు చేయరాదని సూచించారు.

ఈ కార్యక్రమంలో మండలంలోని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

అల్లరి నరేష్ అల్లు అర్జున్ ను ఫాలో అవుతున్నాడా..?