ఆ అమ్మవారికి రాళ్లే ప్రసాదం.. ఏంటీ రాళ్లా! ఎందుకలా?

హిందూ పురాణాల ప్రకారణం మనకు ఉన్న ముక్కోటి దేవతలకు మనం పూజలు చేస్తుంటాం.

అందులో భాగంగానే ఏ దేవుడికి ఏ పదార్థం ఇష్టమో దాన్నే ప్రసాదంగా సమర్పించడం మన ఆనవాయితీ.

అయితే వినాయకుడి ఉండ్రాళ్ల పాయసం, హనుమంతుడికి లడ్డూ, శివుడికి బిల్వ పత్రం, శని దేవుడికి నువ్వుు.

గ్రామ దేవతలకు అయితే పరమాన్నం.ఇలా ఒక్కో దేవుడికి ఒక్కో పదార్థం నైవేద్యంగా సమర్పించి మన భక్తిని చాటుకుంటూ ఉంటాం.

కానీ ఓ చోట.అమ్మవారికి మాత్రం రాళ్లనే నైవేద్యంగా సమర్పిస్తారట.

వినడానికి చాలా విచిత్రంగా ఉన్నప్పటికీ ఇదే నిజం.అసలు అమ్మవారికి రాళ్లు నైవేద్యంగా ఎందుకు సమర్పిస్తున్నారు.

ఆ ఆలయం ఎక్కడ ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.ఝూర్ఖండ్ హజారీబాగ్ లో ఉన్న పంచవాహిని ఆలయంలోని అమ్మవారికి అక్కడి ప్రజలు రాళ్లనే నైవేద్యంగా సమర్పిస్తారు.

గుడిలోకి వెళ్లి స్వచ్ఛమైన మనస్సుతో ఏం కోరుకున్న అమ్మవారు ఆ కోరికను నెరవేరుస్తారని భక్తుల నమ్మకం.

అయితే ఈ ఆలయంలో రాళ్లను నైవేద్యంగా సమర్పించేందుకు పెద్ద కథనే ప్రాచుర్యంలో ఉంది.

1685వ సంవత్సరంలో రామ్ గఢ్ రాజ్యం రాజధానిగా బాదం ఉండేంది.పక్కనే బాదమాహీ నది ప్రవహించేంది.

ఇప్పుడు ఆ నదినే హరాహరో నదిగా పిలుస్తున్నారు.రాజా హేమంత్ సింగ్ ఈ నది ఒడ్డునే ఓ కోట నిర్మించుకున్నాడు.

నది ప్రవాహం వల్ల కోట శిథిలావస్తకు చేరుకుంది.దలేర్ సింగ్ నదీ ప్రవాహాన్ని మళ్లించేందుకు అడ్డుగా రాళ్లు వేయించాడట.

అంతే కాకుండా రాజ్యం సభిక్షంగా ఉండేందుకు ఐదుగురు అమ్మవార్లకు పూజలు జరిపించాడట.అప్పటి నుంచి రాళ్లను దేవతలకు ప్రసాదంగా పెట్టడం ఆనవాయితీగా వస్తోంది.

రాజా దలేర్ సింగ్ బాదం సంక్షేమం కోసం చేసిన పూజల్లో రాళ్లను ప్రసాదంగా వాడేందుకు ఓ ప్రత్యేక కారణమే ఉంది.

నదిని సంరక్షించడంతో పాటు పక్కనే ఉన్న కోటను, ప్రజల ఇళ్లను కూడా పాడవకుండా కాపాడాడు.

పులివెందులలో సీఎం జగన్ నామినేషన్..!