విశాఖ ప్రజలు ఒక రౌడీని ఎంపీగా గెలిపించారు..పవన్ సీరియస్ వ్యాఖ్యలు..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Janasena Chief Pawan Kalyan ) నిర్వహిస్తున్న వారాహి విజయ యాత్ర ప్రస్తుతం విశాఖపట్నంలో సాగుతోంది.

నాలుగో విడత యాత్రలో భాగంగా విశాఖ గాజువాక( Gajuwaka )లో నేడు బహిరంగ సభలో వైసీపీ పై పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

విశాఖ ప్రజలు ఒక రౌడీని ఎంపీగా ఎన్నుకున్నారని విమర్శించారు.  అటువంటి వారిని ఎన్నుకుంటే ప్రజల కోసం వారేం చేస్తారని ప్రశ్నించారు.

ఇలాంటివారు క్రైస్తవ భూములను దోచుకుంటారు.అది వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు.

ప్రజల కోసం నిలబడా లేని వాళ్ళు రాజకీయాల్లోకి రావొద్దు.వైసీపీ ఎంపీలకు పార్లమెంటులో ప్లకార్డులు ప్రదర్శించే దమ్ముందా.

? కేసులు ఉన్న వారికి ధైర్యం ఎలా వస్తుంది.? వచ్చే ఎన్నికలలో నిస్వార్ధంగా పనిచేసేవారిని గెలిపించుకోండి.

ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం అవసరమైతే కేంద్రం కాళ్లు పట్టుకుంటా అని వ్యాఖ్యానించారు.వచ్చే ఎన్నికలలో డబ్బులు కోసం ఓట్లు వేశారంటే.

తర్వాత నేను ఏమి చేయలేను అని పవన్ ప్రజలను హెచ్చరించారు.జగన్( YS Jagan ) ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి కేంద్ర పెద్దల కాళ్ళకి దండం పెట్టి పదివేల కోట్లు తెప్పించుకునే పరిస్థితి.

అదే వచ్చే ఎన్నికలలో కచ్చితంగా నిజాయితీపరులను ఎన్నుకుంటే.కేంద్రం నుండి రావలసినవి వాళ్లే ఇస్తారని పవన్ స్పష్టం చేశారు.

అల్లు అర్జున్ కి ఒక రూల్..వారికి ఒక రూలా… బన్నీ అరెస్టుపై సుమన్ షాకింగ్ కామెంట్స్!