సైబర్ నేరగాళ్ల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా :సైబర్ నేరగాళ్ల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్( SP Akhil Mahajan ) అన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ .సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు పెరుగుతున్న టెక్నాలజీని ఆసరా చేసుకుని అమాయక ప్రజలను అధిక వడ్డీ ఆశా చూపి పెట్టిన పెట్టుబడి కంటే అధిక డబ్బులు వస్తాయని మోసం చేస్తున్నారని, జిల్లా ప్రజలు ఇలాంటి అన్ లైన్ యాప్ లలో పెట్టుబడులు పెట్టి మోసపోవద్దు అని, సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
గుర్తు తెలియని నెంబర్ నుండి వచ్చే లింక్స్, మెసేజ్ లు ఓపెన్ చేయవద్దని, మన ప్రమేయం లేకుండా న మొబైల్స్ కి వచ్చే ఓటీపీ లను ఎవరికి షేర్ చేయవద్దని,లోన్ యాప్ అంటూ సులభంగా లోన్ లు ఇస్తూ అధిక వడ్డీలు వసూలు చేస్తూ మీ యొక్క డేటా మొత్తం తమ అధీనం లోకి తీసుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నారు, కాబట్టి ఎవరు అలాంటి యాప్ లను డౌన్లోడ్ చేయకూడదు అని, ఎవరైనా ఇలాంటి మోసాలకు గురి అయితే వెంటెనే హెల్ప్ లైన్ నంబర్ 1930 ,డయల్ 100 కి కాల్ చేసి తెలియజేయగలరని అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో ఈ వారం రోజుల వ్యవధిలో జరిగిన కొన్ని సైబర్ నేరాలు.
ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితునికి వాట్సాప్ లో బ్యాంకు నుండి ఒక లింకు వచ్చినట్టుగా ఫేక్ లింకు రావడం జరిగింది.
అది నిజంగానే బ్యాంకు వాళ్ళు పంపించారు ఏమో అని దానిని క్లిక్ చేసి బాధితుడు తన డీటెయిల్స్ ఎంటర్ చేయడం జరిగింది దాంతో తన బ్యాంకు ఖాతా నుండి దాదాపుగా 2,39,000/- రూపాయలు కోల్పోవడం జరిగింది.
సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడు తన ఇల్లు అద్దెకి ఇస్తా అని చెప్పి ఓఎల్ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది.
అది చూసిన ఫ్రాడ్ తనకు ఇల్లు అద్దె కావాలని చెప్పి మాట్లాడి అడ్వాన్స్ ఇస్ ఫామ్ ఇస్తానని చెప్పి నమ్మించి ఒక క్యూఆర్ కోడ్ స్కానర్ వాళ్ళకు పంపించి వాది స్కాన్ చేస్తే మీకు డబ్బులు వస్తాయి అని చెప్పగా అది నమ్మి స్కాన్ చేయడం జరిగింది దాంతో 48,000/- రూపాయలు నష్టపోయారు.
●రుద్రంగి పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడు ఫికర్ యాప్ లో జాబ్ కోసం రెస్యూమ్ అప్లోడ్ చేశారు తర్వాత ఒక ఫ్రాడ్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది డాటా ఇంటి జాబ్ ఇస్తాము అని చెప్పి రిజిస్ట్రేషన్ కి 587 పే చేయమని ఒక క్యూఆర్ కోడ్ పంపించడం జరిగింది అ Qr కోడ్ స్కాన్ చేయగా వాళ్ళ ఫోన్ హ్యాక్ అయి దాదాపు 21,000 రూపాయలు కోల్పోవడం జరిగింది.
H3 Class=subheader-styleతీసుకోవలసిన జాగ్రత్తలు:-/h3p
•మీకు లాటరి వచ్చిందని, కాల్ గాని మెసేజ్ గాని వచ్చిందా ?.
ఆశపడకండి, అనుమానించండి.•లాటరి పేరుతో సైబర్ మోసాలు, అప్రమత్తంగా ఉండండి.
మీకు ఇలాంటి మెసేజెస్ వస్తే వెంటనే 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చెయ్యండి.
•వేలల్లో పెట్టుబడి లక్షల్లో లాభాలు అంటూ వచ్చే వాట్సాప్, టెలిగ్రామ్ ప్రకటనలను నమ్మకండి.
•తక్కువ డబ్బులు పెట్టినప్పుడు లాభాలు ఇచ్చి ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టినప్పుడు డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తారు.
ఇలాంటి సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 కి కాల్ చెయ్యండి.•మీకు ఉద్యోగం ఇస్తాం అంటూ మెసేజెస్ చేసి, మిమ్మల్ని డబ్బులు కట్టమంటున్నారు అంటే వాళ్ళు సైబర్ మోసగాళ్ళు అని గ్రహించండి.
•సోషల్ మీడియా లో ప్రకటనలు చూసి పెట్టుబడి పెట్టకండి, కొంచెం ఆగి ఆలోచించండి, అది సైబర్ మోసం కూడా కావచ్చు.
•మీ ప్రమేయం లేకుండా మీకు ఓటీపీ వస్తే దాన్ని ఎవరికీ చెప్పకండి.అది సైబర్ నేరగాళ్ల ఎత్తుగడ అయివుండవచ్చు.
స్టార్ హీరో అల్లు అర్జున్ కు తత్వం బోధపడిందా.. ఇకనైనా ఆ ఒక్క విషయంలో మారతారా?