అష్టవినాయక దర్శనం.. ఎక్కడెక్కడో తెలుసా?

జగన్మాత పార్వతీ దేవి కుమారుడైన విఘ్నేశ్వరుడు విఘ్నాలను నివారించే మూర్తిగా అందరి చేత పూజలు అందుకుంటాడు.

ఎలాంటి కార్యాన్ని అయినా ప్రారంభించే ముందు స్వామిని పూజించి ప్రారంభిస్తే విజయం లభిస్తుంది.

ఆది దంపతుల ప్రథమ పుత్రరత్నమైన గణనాథుడికి తొలి పూజ అన్ని విధాలుగా అన్ని శుభాలకు చేకూర్చుతుంది.

పంచారామ క్షేత్రాలను ఒక్క రోజులో దర్శించుకుంటే ముక్తిదాయకం అని చెబుతారు.అదే కోవలో మహారాష్ట్రలోని అష్ట వినాయక క్షేత్రాలను ఓక వరుసలో దర్శించుకోవడం ఆనవాయితీ.

కాకపోతే ఒక్కరోజులో అన్ని దేవుళ్లను దర్శించుకోవడం చాలా కష్టం.సరిగ్గా ప్రణాళిక వేస్కుంటే రెండు రోజుల్లో అన్ని చోట్లకూ వెళ్లొచ్చు.

బల్లాలేశ్వరుడు.పుణెకి 100 కి.

మీ ల దూరంలో పాలిక్షేత్రంలో ఉంటాడు.వరద వినాయకుడు.

మహడ్ క్షేత్రంలో ఈ వరద వినాయకుడు దర్శనం ఇస్తాడు.చింతామణి గణపతి.

షోలాపూర్ పుణె మార్గంలో ఉండే థేవూర్ క్షేత్రంలో స్వామి చింతామణి గణపతిగా పూజలు అందుకుంటున్నాడు.

మయూరేశ్వరుడు.పుణె జిల్లా బారామతి తాలూకాలోని మోర్ గావ్ గ్రామంలో వెలసిన వినాయకుు మూషికపై కాకుండా మయూరాన్ని ఆసనంగా చేస్కొని ఉండటం ఈ క్షేత్ర ప్రత్యేకత.

సిద్ధి వినాయకుడు.రాక్షసులతో శ్రీ మహా విష్ణువు యుద్ధం చేస్తుండగా.

వినాయకుడు వచ్చి సాయం చేశాడు.అందుకు ఆనందించిన విష్ణుమూర్తి ఇక్కడే గణనాథుడికి ఆలయాన్ని నిర్మించి ఇచ్చాడట.

మహా గణపతి.సిద్ధి, బుద్ధి సమేతంగా పద్మంలో కొలువైన రంజన్ గావ్ వినాయకుడు మహాగణపతి.

విష్ణు వినాయకుడు.ఓఝూర్ ప్రాంతంలో విఘ్నాసురుడనే రాక్షసుడితో వినాయకుడు యుద్ధం చేయగా.

కాసేపటికే ఆ రాక్షసుడు స్వామివారితో కాళ్ల బేరానికి వచ్చాడు.తన పేరు మీదగా ఇక్కడే ఉండాలంటూ కోరాడు.

అందుకు ఒఫ్పుకున్న వినాయకుడు అక్కడే ఉండిపోయాడు.గిరిజాత్మజ వినాయకుడు.

గిరిజాత్మజుడు అంటే పార్వతీ దేవి కుమారుడు అని అర్థం.ఎత్తైన కొండ మీద ఒక గుహలో ఈ స్వామి వారు కొలువై ఉన్నారు.