మొసంగిలో కుక్కల స్వైర విహారం

నల్లగొండ జిల్లా:గుర్రంపోడు మండలం మొసంగి గ్రామంలో కుక్కలు స్వైరవిహారం చేస్తూ గ్రామస్తులపై వరుస దాడులు చేస్తున్నాయి.

రోజుకు ఒకరిని గాయపరుస్తూ ఉండగా రోజుకో కుటుంబం ఆసుపత్రి పాలవుతున్నారు.మనుషులు దొరకకపోతే పశువులపై దాడి చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి.

కుక్కల బెదడతో బయటికి ఒంటరిగా వెళ్ళాలంటే పిల్లలు,మహిళలు జంకుతున్నారు.వీధి కుక్కలతో గ్రామస్తులు నిత్యం ఇబ్బంది పడుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో అధికారుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదే విషయమై గ్రామకార్యదర్శి శోభను వివరణ కోరగా డాగ్స్ ఆఫీసర్స్ తో మాట్లాడుతున్నామని,రెండు రోజుల్లో సమస్యనిటీ పరిష్కరిస్తామని తెలిపారు.

Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich