బీజేడీ ఎమ్మెల్యేను చితకబాదిన జనం.. వైరల్ గా మారిన వీడియో..

బీజేడీ ఎమ్మెల్యేను చితకబాదిన జనం వైరల్ గా మారిన వీడియో

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన లిఖింపూర్ ఖేరీ ఘటన మాదిరిగా ఒడిషా రాష్ట్రంలో కూడా ఒక ఘటన జరిగింది.

బీజేడీ ఎమ్మెల్యేను చితకబాదిన జనం వైరల్ గా మారిన వీడియో

లిఖింపూర్ ఖేరీలో ధర్నా చేస్తున్న రైతుల పైకి ఓ మంత్రి కొడుకు కారుతో దూసుకుపోతాడు.

బీజేడీ ఎమ్మెల్యేను చితకబాదిన జనం వైరల్ గా మారిన వీడియో

ఈ ఘటనలో చాలా మంది రైతులు గాయపడ్డారు.ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

సుప్రీం కోర్టు కూడా ఈ ఘటన మీద విచారణ చేపట్టింది.ప్రస్తుతం అటువంటి ఘటనే ఒడిషా రాష్ట్రంలోని ఖోర్ధా జిల్లాలో జరిగింది.

బీజేడీ పార్టీకి చెందిన బహిషృత ఎమ్మెల్యే ప్రశాంత్ జగదేవ్ కారు నడుపుకుంటూ నిల్చొని ఉన్న వారిపైకి దూసుకెళ్లాడు.

ఈ ఘటనలో పోలీసులతో పాటుగా సాధారణ పౌరులు కూడా గాయపడ్డారు.దాదాపు 22 మంది దాక గాయపడ్డట్లు పలు రిపోర్టులు చెబుతున్నాయి.

గాయపడిన వారిలో 15 మంది బీజేపీ కార్యకర్తలు కాగా, ఏడుగురు పోలీసులు.ఖోర్ధా జిల్లాలోని బానాపూర్ బ్లాక్ ఆఫీస్ ఎదుట ఈ ఘటన జరిగింది.

బానాపూర్ బ్లాక్ ఆఫీస్ ఎదుట పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి.దీంతో అక్కడ చాలా మంది ఉన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అక్కడ ఉన్న జనాల మీదికి కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాడు.

దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అక్కడ ఉన్న ప్రజలు ఎమ్మెల్యేను కిందికి దించి చితకబాదారు.

ఈ ఘటనలో ఎమ్మెల్యేకు తీవ్ర గాయాలయ్యాయి.అంతే కాకుండా కోపంతో అక్కడి ప్రజలు ఎమ్మెల్యే వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు.

ఈ ఘటన జరిగినపుడు ఎమ్మెల్యే మద్యం మత్తులో ఉండి వాహనం నడుపుతున్నాడని అక్కడి స్థానికులు పేర్కొంటున్నారు.

గాయపడిన వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.అనంతరం జగదేవ్ ను కూడా పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ప్రభుత్వ వ్యతిరేఖ కార్యకలాపాలు చేస్తున్నాడంటూ జగదేవ్ ను బీజేడీ (బిజూ జనతా దళ్) పార్టీ గతేడాది పార్టీ నుంచి బయటకు పంపించేసింది.

ఈ పొడిని రోజుకు అర టీ స్పూన్ తీసుకుంటే బాన పొట్టకు బై బై చెప్పచ్చు!