ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. అందిన కాడికి నూనెను దోచుకెళ్లిన ప్రజలు!

ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగుతారు అనే నానుడి ఉత్తిగే రాలేదండి.ఉఛితంగా ఏదైనా వస్తుందంటే దాన్ని దక్కించుకునేందుకు చాలా మంది కష్టపడతారు.

పరుగులు పెడుతుంటారు.అందులోనూ విలువ చేసేవి అంటే ఇంక చెప్పాల్సిన పని లేదు.

అలాంటి ఓ ఘటనే చోచు చేసుకుంది ఏపీలోని పల్నాడు జిల్లాలో.నకరికల్లు మండలం చల్లగుండ్ల వద్ద నార్కట్ పల్లి - అద్దంకి హైవేపై ఓ ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది.

చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న మంచి నూనె ట్యాంకర్ అదుపు తప్పి ప్రధాన రహదారిపై బోల్తా పడింది.

ట్యాంకర్ లో ఉన్న మంచి నూనె మొత్తం రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడింది.

డ్రైవర్ కు, క్లీనర్ కు గాయాలు అవడంతో ఆసుపత్రికి వెళ్లారు.ఇంకేముంది ఒకరి ద్వారా ఒకరు స్థానిక ప్రజలంతా విషయం తెలుసుకున్నారు.

ఇంట్లో ఉన్న పిల్లా జెల్లా అందర్నీ పట్టుకొని పరుగులు పెడుతూ సంఘటనా స్థలానికి వచ్చారు.

ఇంకేముంది ముంతలూ, చెంబులూ, బక్కెట్లు, బిందెలు ఇలా తమకు దొరికింది పట్టుకొచ్చి నూనె పట్టుకెళ్లారు.

"""/" / విషయం తెలుసుకున్న నకరికల్లు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రజలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు.

అయిప్పటికీ వారు వినకపోవడంతో.ఇక చేసేదేం లేక వదిలేశారు.

అసలే వంట నూనె ధరలు అధికంగా ఉండటంతో ఎగబడి మరీ నూనెను తీసుకెల్లారు.

భారీ సంఖ్యలో జనాలు వస్తూనే ఉన్నారు.నూనె మొత్తం అయిపోయే వరకూ అక్కడే ఉండి.

దొరికిన కాడికి అందుకు పోయారు.