ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారు..: మంత్రి కేటీఆర్
TeluguStop.com
కామారెడ్డి నియోజకవర్గం ఉద్యమ స్ఫూర్తిని తెచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు.2004 లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉండేదన్న ఆయన సీఎం కేసీఆర్ ను బతిమిలాడి పోటీ చేసి షబ్బీర్ అలీ గెలిచారని తెలిపారు.
పొత్తు ధర్మంలో భాగంగా షబ్బీర్ అలీకి సీటు ఇవ్వాల్సి వచ్చిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
దేశంలోనే ఉత్తమ పాలకుడు కేసీఆర్ అని కొనియాడారు.రానున్న ఎన్నికల్లో కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేయాలని గంప గోవర్ధన్ ఆహ్వానించారని తెలిపారు.
ఈ క్రమంలోనే కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేస్తే ఈ ప్రాంత రూపురేఖలు మారుతాయని చెప్పారు.
కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా బలమైన ఆశయం ఉంటుందన్నారు.ముదిరాజ్ లకు ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యమిస్తామన్నారు.
రాష్ట్ర ప్రజలు అంతా బీఆర్ఎస్ వైపు ఉన్నారని వెల్లడించారు.
బాలయ్య, వెంకటేష్ ఫ్యాన్స్ ఆ విషయంలో అసంతృప్తి తో ఉన్నారా..?