ప్రజలు అన్నీ గమనిస్తున్నారు..: వైఎస్ అవినాశ్ రెడ్డి

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, సునీతా రెడ్డి చేసిన ఆరోపణలపై కడప ఎంపీ అవినాశ్ రెడ్డి( MP Avinash Reddy ) స్పందించారు.

తనపై షర్మిల, సునీత బురద జల్లుతున్నారని మండిపడ్డారు. """/" / రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఎంపీ అవినాశ్ రెడ్డి అన్నారు.

సునీతారెడ్డితో ఒప్పందంతోనే దస్తగిరి అఫ్రూవర్ గా మారాడని తెలిపారు.దస్తగిరి బెయిల్ కు సునీతా రెడ్డి( Sunita Reddy ) అడ్డు చెప్పలేదని వెల్లడించారు.

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

ఈ కేసులో ఇరికించి తనను ఎంతో ఇబ్బంది పెట్టారని అవినాశ్ రెడ్డి తెలిపారు.

తానే కాకుండా తన కుటుంబం అంతా నరకయాతన పడుతోందని చెప్పారు.ఈ క్రమంలోనే వాస్తవాలన్నీ బయటకు వస్తాయని ఆయన వెల్లడించారు.

బిగ్ బాస్ సీజన్8 అట్టర్ ఫ్లాప్ కావడానికి కారణాలివేనా.. తెర వెనుక ఇంత జరిగిందా?