రేవంత్ రెడ్డి పాలనపై ప్రజలు సంతోషంగా ఉన్నారు..: మల్లు రవి
TeluguStop.com

తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి పాలనపై ప్రజలు సంతోషంగా ఉన్నారని కాంగ్రెస్ నేత మల్లు రవి అన్నారు.


రేవంత్ పాలనపై ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారని తెలిపారు.ప్రభుత్వాన్ని సామాన్యులకు అందుబాటులోకి తెచ్చారని మల్లు రవి పేర్కొన్నారు.


పేదలకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నారని చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణకు ఆదేశించారని తెలిపారు.రాష్ట్రంలో డ్రగ్స్ విక్రయాలపై ఉక్కుపాదం మోపామన్నారు.
అలాగే హైకోర్టు కోసం వంద ఎకరాలు ఇచ్చారన్న మల్లు రవి కేంద్రంతో సత్సంబంధాలు నెలకొల్పారని తెలిపారు.
కానీ బీఆర్ఎస్ కావాలనే కుట్ర పూరితంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు.
ఏపీ బ్రాండ్ అంబాసిడర్ గా చాన్స్ కొట్టేసిన మీనాక్షి చౌదరి…. వెల్లువెత్తుతున్న విమర్శలు?